Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : నేడు ఆరో దశ పోలింగ్

Advertiesment
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : నేడు ఆరో దశ పోలింగ్
, గురువారం, 3 మార్చి 2022 (08:08 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం ఆరో దశ పోలింగ్ జరుగుతుంది. ఈ దశలో 10 జిల్లాల్లోని 57 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగతుంది. గోరఖ్‌పూర్‌తో సహా పది జిల్లాల్లో 57 నియోజకవర్గాలకు మార్చి 3వ తేదీన ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు వీలుగా పోలింగ్ ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అజయ్ కుమార్ శుక్లా వెల్లడించారు. 
 
ఈ పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఈ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీచేసినట్టు ఆయన తెలిపారు. ఈ దశలో మొత్తం 2.14 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 
 
కాగా, గత 2017లో జరిగిన ఎన్నికల్లో ఈ 57 సీట్లలో బీజేపీకి, దాని మిత్రపక్షాలైన ఆప్నాదళ్ ఎస్, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీలు ఏకంగా 46 సీట్లను గెలుచుకున్నాయి. ఈ మొత్తం సీట్లలో 11 సీట్లు రిజర్వుడ్ స్థానాలు. చివరి దశ పోలింగ్ మార్చి 7వ తేదీన జరుగనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరిన సీ-17 విమానం - 420 రాక