Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్నికల్లో గెలిపిస్తే రూ.1.40 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఇస్తాం : అఖిలేష్ యాదవ్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రాష్ట్ర ఓటర్లపై వరాల జల్లు కురిపించారు. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న అఖిలేష్... ఆదివారం ఎన్నికల మేనిఫెస్టోను వి

Advertiesment
Uttar Pradesh Election 2017
, ఆదివారం, 22 జనవరి 2017 (15:32 IST)
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రాష్ట్ర ఓటర్లపై వరాల జల్లు కురిపించారు. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న అఖిలేష్... ఆదివారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా ఆయన మేనిఫెస్టోలో అంశాలు పేర్కొన్నారు. 
 
ప్రధానంగా 'సమాజ్ వాదీ స్మార్ట్ ఫోన్ యోజన' పథకం కింద 1.40 కోట్ల స్మార్ట్ ఫోన్లను ఉచితంగా అందిస్తామని తెలిపారు. పేద మహిళలకు కుక్కర్లు అందిస్తామని, వారికి నెలకు రూ.1000 పింఛన్ ఇస్తామని వాగ్దానం చేశారు. రైతుల అన్ని అవసరాలనూ తీర్చేందుకు డబ్బిస్తామని చెప్పారు. పాత మ్యానిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలతో పాటు కొత్త హామీలనూ అమలు చేస్తామని, ప్రతి గ్రామంలోనూ ల్యాప్ టాప్ అందుబాటులో ఉంచిన ఘనత తమదేనని చెప్పుకొచ్చారు.
 
కాన్పూర్, ఆగ్రాలో మెట్రో రైల్‌ను నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్రంలో మరిన్ని ఎయిర్ పోర్టులను నిర్మిస్తామని, మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరింత క్వాలిటీతో కూడిన విద్యను అందిస్తామని, అన్ని రహదారులనూ నాలుగు లైన్లుగా విస్తరిస్తామని అఖిలేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలకు వచ్చి చదువుకునే ప్రతి చిన్నారికీ నెలకు లీటరు నెయ్యి, కేజీ పాల పొడిని అందిస్తామని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జల్లికట్టు ఆర్డినెన్స్‌ను కోర్టులో సవాల్ చేయొచ్చు.. కానీ ఆందోళన వద్దు : ఖట్జూ