Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పే స్పీకర్లు కూడా ఉన్నారా.. అదీ మన దేశంలో.

రాజ్యాంగంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని అపరిమితాధికారాలను చలాయిస్తూ కోర్టులకు కూడా చిక్కకుండా వ్యవహారాలు నడుపుతున్న స్పీకర్లను చూస్తున్న కాలంలో తన వ్యాఖ్యలు సభ్యురాలిని బాధపెట్టాయని గ్రహించి ఆనక క్షమాపణలు కూడా చెప్పిన స్పీకర్ ఈ దేశంలో ఉన్నారంటే ఆశ్చ

చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పే స్పీకర్లు కూడా ఉన్నారా.. అదీ మన దేశంలో.
హైదరాబాద్ , శనివారం, 18 మార్చి 2017 (02:23 IST)
రాజ్యాంగంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని అపరిమితాధికారాలను చలాయిస్తూ కోర్టులకు కూడా చిక్కకుండా వ్యవహారాలు నడుపుతున్న స్పీకర్లను చూస్తున్న కాలంలో తన వ్యాఖ్యలు సభ్యురాలిని బాధపెట్టాయని గ్రహించి ఆనక క్షమాపణలు కూడా చెప్పిన స్పీకర్ ఈ దేశంలో ఉన్నారంటే ఆశ్చర్యమేస్తుంది. అది కూడా గుజరాత్‌లో ఇలాంటి ఘటన జరిగిందంటే మరీ ఆశ్చర్యం. 
 
గుజరాత్ అసెంబ్లీలో స్పీకర్ రమణ్‌లాల్ వోరా చేసిన వ్యాఖ్యలకు ప్రతిపక్ష కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే తేజశ్రీబెన్ పటేల్ కంటతడి పెట్టారు. ఈ ఘటనపై స్పీకర్ వోరా.. ఆమెకు క్షమాపణలు చెప్పారు. శుక్రవారం గుజరాత్ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎమ్మెల్యే జగ్రూప్‌సింగ్ రాజ్‌పుట్‌ మున్సిపాలిటీలకు నిధుల కేటాయింపుపై ఓ ప్రశ్న అడిగారు. ఈ సమయంలో తేజశ్రీబెన్ లేచి ఈ అంశానికి సంబంధించి మరో ప్రశ్న అడగబోయారు. ఇంతలో స్పీకర్ వోరా జోక్యం చేసుకుంటూ కూర్చోవాల్సిందిగా ఆమెకు సూచించారు. 'డోన్ట్ బీ ఓవర్ స్మార్ట్' అంటూ ఆమెను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.  
 
ఈ వ్యాఖ్యలకు తేజశ్రీబెన్ మనస్తాపం చెందారు. ఆమె ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలసి స్పీకర్ ఛాంబర్‌కు వెళ్లి ఆయన వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. స్పీకర్ ఛాంబర్‌ ముందు భావోద్వేగానికి గురైన ఆమె కంటతడి పెట్టారు. తాను కావాలని ఆ మాటలు అనలేదని, బాధ కలిగిస్తే క్షమించాల్సిందిగా స్పీకర్ ఆమెను కోరారు. దీంతో ఈ వివాదం సమసిపోయింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దక్షిణాది రైతులకు రుణమాఫీ ఎందుకు చేయరు? కేంద్రానికి పవన్ ప్రశ్న