Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దక్షిణాది రైతులకు రుణమాఫీ ఎందుకు చేయరు? కేంద్రానికి పవన్ ప్రశ్న

రుణమాఫీ విషయంలో ఉత్తరాదిని ఒకలా దక్షిణాదిని ఒకలా ఎందుకు చూస్తున్నారంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలో రైతులు కష్టాలు అనుభవిస్తూ, వేసిన పంట చేతికి రాక, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారో అలాంటి ప్రతి రాష

Advertiesment
దక్షిణాది రైతులకు రుణమాఫీ ఎందుకు చేయరు? కేంద్రానికి పవన్ ప్రశ్న
, శుక్రవారం, 17 మార్చి 2017 (20:03 IST)
రుణమాఫీ విషయంలో ఉత్తరాదిని ఒకలా దక్షిణాదిని ఒకలా ఎందుకు చూస్తున్నారంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలో రైతులు కష్టాలు అనుభవిస్తూ, వేసిన పంట చేతికి రాక, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారో అలాంటి ప్రతి రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేంద్రానికి తెలియడం లేదా అని ప్రశ్నించారు. రుణమాఫీ పథకాన్ని తెలుగు రాష్ట్రాలకు కూడా వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.
 
దక్షిణాది రాష్ట్రాల పట్ల నిర్లక్ష్యం చూపవద్దని వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం వైఖరి దేశ సమగ్రతను దెబ్బతీసేదిగా వుండకూడదని పేర్కొన్నారు. గతంలో తెలుగు రాష్ట్రాల రైతుల రుణమాఫీ చేయాలని అభ్యర్థిస్తే వీరికి నీతులు చెప్పారనీ, అలాంటి నీతులు భాజపాకు వర్తించవా అని ఎద్దేవా చేశారు. మరి పవన్ కళ్యాణ్ మాటలను కేంద్రం ఏమేరకు పట్టించుకుంటుందో చూడాల్సి వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింహంపైన కూర్చుని పాక్ పెళ్లికొడుకు ఊరేగాడా? పంజా విసరలేదా?