బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. బంగారం ధరల పెరుగుదల కారణంగా దానిని కొని దాచుకోవడానికి సిద్ధం అవుతున్నారు. తాజాగా ఒక మహిళ తన వదిన పెళ్లి కోసం ఉంచిన సుమారు రూ.50 లక్షల విలువైన ఆభరణాలను దొంగిలించిందని పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని మొహల్లా నాయి బస్తీ నివాసి అక్రమ్ అలియాస్ కలువా నవంబర్ 11న తన సోదరి వివాహం కోసం బంగారు ఆభరణాలు, నెక్లెస్‌లు, గాజులు, గొలుసులు, ఉంగరాలు ఉంచాడు. సుమారు రూ.50 లక్షల విలువైన ఆభరణాలు అక్టోబర్ 23 రాత్రి తన ఇంటి నుండి మాయమయ్యాయి.
మరుసటి రోజు హత్రాస్ గేట్ పోలీస్ స్టేషన్‌లో అక్రమ్ బంగారం నగల కోసం ఫిర్యాదు చేశాడు. పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) చిరంజీవ్ నాథ్ సిన్హా దర్యాప్తునకు ఆదేశించారు. దర్యాప్తులో, అక్రమ్ భార్య తన వదినతో సంబంధాలను దెబ్బతీసిందని, ఆ ఆభరణాలను ఆమెకు ఇవ్వడం ఇష్టం లేదని, కాబట్టి ఆమె ఆ ఆభరణాలను దొంగిలించి తన తల్లిదండ్రుల ఇంటికి పంపిందని వెల్లడైంది.
అక్రమ్ తన భార్యను ప్రశ్నించగా, ఆమె దొంగతనం చేసినట్లు అంగీకరించింది. దీంతో కోల్పోయిన ఆభరణాలను కుటుంబానికి అప్పగిస్తున్నాం. తదుపరి చట్టపరమైన చర్యలు జరుగుతున్నాయని సిన్హా చెప్పారు.