తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తుంటారు ఆ కోవలోనే శ్రీవారి ఆలయ ప్రధాన గోపురం చెంత ఓ పొడవాటి మహిళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏడు అడుగుల ఎత్తు ఉన్న ఆ మహిళను చూసి భక్తులు షాకయ్యారు. 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	ఇంతకీ ఆమె ఎవరంటే.. శ్రీలంక నెట్ బాల్ క్రీడలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన తర్జని శివలింగం. సోమవారం తర్జని శివలింగం శ్రీవారిని దర్శించుకున్నారు. ఏడు అడుగుల పొడవు ఉన్న ఈ శ్రీలంక క్రీడాకారిణి శ్రీవారి దర్శనానికి వచ్చారు. యాత్రికులతో కలిసి క్యూలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్లారు. 
 
									
										
								
																	
	 
	ఆ సమయంలో ఆమె వెంట నడుస్తున్న వారే ఆమెను ప్రత్యేకంగా చూస్తుండిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అలాగే తిరుమల శ్రీవారి దర్శనానికి వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి తన భక్త బృందంతో సోమవారం తిరుమలకు వచ్చి స్వామిని దర్శించుకున్నారు.