Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యూపీలో వింత ఘటన.. బావ చెల్లెలితో బావమరిది.. బావమరిది సోదరితో బావ జంప్..

Advertiesment
crime

సెల్వి

, బుధవారం, 17 సెప్టెంబరు 2025 (17:34 IST)
crime
ప్రస్తుత స్మార్ట్ ఫోన్‌ కాలంలో విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కుటుంబ విలువలు మంటగలిసిపోతున్నాయి. వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. తాజాగా సినీ ఫక్కీలో ఓ ఘటన యూపీలో చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన భార్య చెల్లితో జంప్ కాగా, అతడి సోదరితో బావమరిదితో పరారైన ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. ఆగస్టు 23వ తేదీన చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. 28 ఏళ్ల కేశవ్ కుమార్‌, ఆయన భార్య చెల్లెలు కల్పనతో పారిపోయాడు. ఈ విషయం తెలుసుకుని ఆయన కుటుంబం షాక్ అయ్యింది. ఈ స్టోరీ ఇంతటితో ముగియలేదు. మరుసటి రోజే కేశవ్ బావమరిది రివెంజ్ తీసుకున్నాడు. దీంతో కేశవ్ బావమరిది రవీంద్ర తన బావ కేశవ్ సోదరితో జంప్ అయ్యాడు. 
 
ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వీరిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు రెండు రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టి.. చివరికి ఈ నెల 14, 15 తేదీల్లో వారిని పట్టుకున్నారు. కౌన్సిలింగ్ ఇవ్వడంతో ఈ సమస్య పరిష్కారం అయ్యింది. కేశవ కుమార్ కల్పనను, రవీందర్ కేశవ సోదరిని విడిచిపెట్టేందుకు అంగీకరిచారు. దీంతో అందరూ హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిల్లలు పుట్టలేదని కోడల్ని పొట్టనబెట్టుకున్నారు.. హత్య చేసి కాల్చేయాలనుకున్నారు..