Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ - కేంద్ర మంత్రి సురేశ్ గోపీపై కేసు

Advertiesment
suresh gopi

ఠాగూర్

, ఆదివారం, 3 నవంబరు 2024 (19:34 IST)
కేంద్ర సహాయ మంత్రి, మలయాళ సినీ నటుడు సురేశ్ గౌపీపై కేరళ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. త్రిస్సూర్‌పురం సంబరాలకు హాజరయ్యేందుకు వెళుతూ అంబులెన్స్‌ను దుర్వినియోగం చేశారన్న అభియోగాలపై ఆయనపై కేసు నమోదైంది. 
 
ఈ యేడాది ఏప్రిల్ 20వ తేదీన త్రిస్సూర్‌పురంలోని స్వరాజ్ మైదానానికి ఆయన అంబులెన్స్‌‍లో వచ్చారని, ఈ క్రమంలో ఆయన వన్ వే రోడ్డులో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి వచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. అది కూడా రోగులను తరలించేందుకు ఉపయోగించే అంబులెన్స్‌లో రావడం వివాదాస్పదమైంది. అయితే, తాను అనారోగ్యంగా ఉండటం వల్లే అంబులెన్స్‌లో రావాల్సి వచ్చిందంటూ ఈ వివాదంపై ఆయన వివరణ ఇచ్చారు. 
 
అయితే, ఈ అంశంపై ఓ కమ్యూనిస్టు నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు సురేశ్ గోపీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఐపీసీ 279, 34 సెక్షన్లు, మోటార్ వాహనాల చట్టం కింద 179, 184, 188, 192 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మలయాళ చిత్రపరిశ్రమలో సూపర్ స్టార్‌గా ప్రఖ్యాతిపొందిన సురేశ్ గోపీ రాజకీయాల్లోకి ప్రవేశించడమే కాకుండా, ఎంపీగా గెలుపొందిన కేంద్ర మంత్రివర్గంలోనూ చోటు దక్కించుకున్నారు. కేరళలో బీజేపీ తరపున లోక్‌సభకు ఎన్నికైన తొలి ఎంపీగా సురేశ్ గోపీ చరిత్ర సృష్టించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్వీస్ రివాల్వర్‌తో ఎస్ఐను కాల్చి చంపేసిన కానిస్టేబుల్.. ఎక్కడ?