Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అరుణాచల్ ప్రదేశ్‌లో కూలిన అత్యాధునిక హెలికాప్టర్: ఇద్దరు మృతి

Helicopter
, శుక్రవారం, 21 అక్టోబరు 2022 (15:54 IST)
Helicopter
అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీకి చెందిన అత్యాధునిక హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. అప్పర్ సియాంగ్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్ శుక్రవారం కూలిపోయింది. ప్రమాదం జరిగిన మిగ్గింగ్ గ్రామం అటవీ ప్రాంతమని ఆర్మీ అధికారులు చెప్పారు. 
 
ఆ ప్రాంతానికి రోడ్డు మార్గం లేకపోవడంతో సహాయక చర్యలకు ఆలస్యమవుతోందని వివరించారు. ఇప్పటికే ఓ సహాయక బృందాన్ని ప్రమాద స్థలానికి పంపించినట్లు పేర్కొన్నారు. అయితే, ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఎంతమంది ఉన్నారనే వివరాలు తెలియరాలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలికలను వేధించిన టీచర్.. చెప్పులతో కొట్టిన తల్లిదండ్రులు