Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉడుపిలో గ్యాంగ్ వార్ : అర్థరాత్రి నడిరోడ్డుపై కార్లు - కర్రలు దాడులు

Advertiesment
gangwar

ఠాగూర్

, ఆదివారం, 26 మే 2024 (12:18 IST)
కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపిలో రెండు గ్యాంగులు అర్థరాత్రివేళ నడిరోడ్డుపై తలపడ్డాయి. కార్లతో ఢీకొట్టుకుంటూ కర్రలతో దాడులు చేసుకుంటూ బీభత్సం సృష్టించాయి. ఈ నెల 18న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.
 
రెండు కార్లలో వచ్చిన ఆరుగురు యువకులు రాత్రివేళ ఉడుపి మణిపాల్ హైవేపై చెలరేగిపోయారు. తెలుపు రంగు కారు బ్రౌన్ కలర్ కారును తొలుత ఢీకొట్టింది. ఆ తర్వాత రెండు కార్లలోంచి దిగిన యువకులు కర్రలతో ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. ఈలోగా తెలుపురంగు కారు మళ్లీ వెనక్కి ప్రత్యర్థుల కారును ఢీకొట్టే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో అడ్డుకునే ప్రయత్నం చేసిన యువకుడిని బలంగా ఢీకొట్టడంతో అతడు అమాంతం పైకి ఎగిరి కిందపడ్డాడు. చలనం కోల్పోవడంతో అతడి పరిస్థితి ఏమిటన్నది తెలియరాలేదు.
 
తీవ్రగాయాలతో కిందపడిన వ్యక్తి వద్దకు వచ్చిన ప్రత్యర్థులు మళ్లీ దాడిచేశారు. చివరికి సొంతగ్రూపు సభ్యులు వారి నుంచి అతడిని రక్షించి కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఈ మొత్తం ఘటనను ఓ వ్యక్తి షూట్ చేసి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అది పోలీసుల దృష్టికి చేరడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండు గ్రూపుల మధ్య గొడవలే ఈ ఘటనకు కారణమని పోలీసులు పేర్కొన్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశామని, మిగతా నలుగురి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మాయిలతో వైకాపా నేతల అర్థనగ్న నృత్యాలు.. ఎక్కడ?