Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్వామి గంగేశానంద తండ్రిలాంటివాడు.. రేప్ చేయలేదు.. అతనితో అక్రమసంబంధం ఉంది...

కేరళ రాష్ట్రంలో స్వామి గంగేశానంద ఓ అమ్మాయిపై అత్యాచారం చేయబోతే మర్మాంగాన్ని కోసేసిన కేసులో బాధితురాలే మాట మార్చింది. ఆయన తనకు తండ్రిలాంటివాడనీ, తనపై అత్యాచారం చేయలేదని, కేవలం దగ్గరకు తీసుకున్నారంతేనంట

స్వామి గంగేశానంద తండ్రిలాంటివాడు.. రేప్ చేయలేదు.. అతనితో అక్రమసంబంధం ఉంది...
, బుధవారం, 21 జూన్ 2017 (09:02 IST)
కేరళ రాష్ట్రంలో స్వామి గంగేశానంద ఓ అమ్మాయిపై అత్యాచారం చేయబోతే మర్మాంగాన్ని కోసేసిన కేసులో బాధితురాలే మాట మార్చింది. ఆయన తనకు తండ్రిలాంటివాడనీ, తనపై అత్యాచారం చేయలేదని, కేవలం దగ్గరకు తీసుకున్నారంతేనంటూ చెప్పింది. అయితే, ఆయన ప్రత్యర్థితో తనకు అక్రమ సంబంధం ఉందని పేర్కొంది. దీంతో ఆమెను పాలీగ్రాఫ్ పరీక్షకు పంపించాలని త్రివేండ్రం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ప్రొటెక్షన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 
తన ఆశ్రమంలో పని చేస్తున్న ఓ యువతిపై స్వామి గంగేశానంద అత్యాచారం చేయడానికి యత్నిస్తే.. ఆ యువతి స్వామి మర్మాంగాన్ని కోసేసిన విషయం తెల్సిందే. కేరళలోనేకాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా క్రైమ్ బ్రాంచ్ విభాగానికి బదిలీ చేసిన విషయం తెల్సిందే. 
 
అయితే ఈ కేసులో బాధిత యువతి మాట మార్చింది. తనకు తండ్రిలాంటి వాడని, తనపై అత్యాచారయత్నం చేయలేదని కోర్టుకు సమర్పించిన టెలిఫోన్ సంభాషణలో బాధిత యువతి పేర్కొంది. తాను స్వామిజీ మర్మాంగాన్ని కోయలేదని పోలీసులే స్వామిజీకి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని తనపై ఒత్తిడి చేశారని ఆరోపించింది. 
 
అంతేకాకుండా, అయ్యప్పదాస్ అనే వ్యక్తితో తనకు సంబంధముందని పేర్కొంది. అయ్యప్పదాస్‌కు స్వామిజీకి మధ్య ఆర్థిక వివాదాలున్నాయని బాధిత యువతి పేర్కొంది. బాధిత యువతి అర్థగంట పాటు మాట్లాడిన ఫోన్ సంభాషణను స్వామి న్యాయవాది ఓ లేఖతో పాటు జతచేసి కోర్టుకు సమర్పించారు. 
 
బాధిత యువతి తల్లిదండ్రులను స్వామిజీ మనుషులు ఆధీనంలో పెట్టుకొని ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చి కేసును నీరుగార్చేందుకు ఇలా మాట్లాడించవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ ఈ కేసులో బాధిత యువతి వాంగ్మూలమే కీలకమని, ఆమె మాట మారిస్తే కేసు నీరుగారిపోతుందని పోలీసులు చెపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శిరీష కేసులో కొత్త ట్విస్ట్.. దుస్తులపై రక్తపు మరకలు.. అత్యాచారం జరిగిందా?