Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శిరీష కేసులో కొత్త ట్విస్ట్.. దుస్తులపై రక్తపు మరకలు.. అత్యాచారం జరిగిందా?

బ్యూటీషియన్ శిరీష్ ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శిరీషది ఆత్మహత్య అని తేల్చిన పోలీసులు.. ప్రస్తుతం ఫోన్ ఆడియో టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన సంగతి తెలిసిందే. అయితే శిరీషపై

శిరీష కేసులో కొత్త ట్విస్ట్.. దుస్తులపై రక్తపు మరకలు.. అత్యాచారం జరిగిందా?
, బుధవారం, 21 జూన్ 2017 (08:55 IST)
బ్యూటీషియన్ శిరీష్ ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శిరీషది ఆత్మహత్య అని తేల్చిన పోలీసులు.. ప్రస్తుతం ఫోన్ ఆడియో టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన సంగతి తెలిసిందే. అయితే శిరీషపై అత్యాచారం జరిగిందా? ఎస్సై ప్రభాకర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడా అనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా శిరీష మరణించిన సమయంలో ధరించిన దుస్తుల్లో రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 
 
దీంతో ఆమెపై అత్యాచారం జరిగివుండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. కోర్టుకు సమర్పించిన రిపోర్ట్ లో శిరీషలో దుస్తులపై మరకలు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా ఈ అంశంపై  ఫోరెన్సిక్ నివేదిక రావాల్సి ఉంది. ఈ నివేదిక అందిన తర్వాతే అత్యాచారంపై పూర్తి నిర్ధారణకు వస్తామని పోలీసులు తెలిపారు. 
 
మరోవైపు శిరీష ఆత్మహత్య కేసులో నిందితులైన శ్రవణ్‌, రాజీవ్‌లు ప్రస్తుతం జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. శిరీష కేసులో ఏ1 శ్రవణ్‌... గతంలో పలుమార్లు ఎస్సై ప్రభాకర్‌రెడ్డికి అమ్మాయిలను పంపేవాడని, సమస్య పరిష్కారం పేరుతో శిరీషను కుకునూర్‌పల్లికి తీసుకెళ్లక ముందే ఆమె ఫోటోలను ఎస్సైకి వాట్సాప్‌లో పంపాడని తెలిసింది. అంతకముందు జరిగిన ఫోన్‌ సంభాషణల్లోనూ శిరీష అందం గురించి ఎస్సై ప్రభాకర్‌రెడ్డితో శ్రవణ్‌ మాట్లాడాడని రిమాండ్‌ డైరీలో పేర్కొన్నారు. 
 
కుకునూర్‌పల్లిలో కూడా ఆ రోజు రాత్రి సెక్స్‌వర్కర్ల దగ్గరికి వెళ్లాలని ఎస్సై ప్రభాకర్‌రెడ్డి.. రాజీవ్‌, శ్రవణ్‌లను క్వార్టర్స్‌నుంచి బయటికే పంపాడు. గదిలో ఒంటరిగా చిక్కిన శిరీషను ఎస్సై ప్రభాకర్‌రెడ్డి దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేయగా, ఆమె ప్రతిఘటించింది. ఆపై బిగ్గరగా కేకలు వేయడంతో శ్రవణ్, రాజీవ్‌లను రప్పించి శిరీషను ఎస్సై తీసుకెళ్లమన్నట్లు పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్నమ్మతో తంబిదురై తదితరుల ములాఖత్‌.. రాష్ట్రపతి ఎన్నికల్లో రాజకీయం చూపించాలని నిర్ణయం