తప్పతాగింది... కైపు తలకెక్కింది... బార్‌లో బుల్లితెర నటిపై దాడి
ఐటీ నగరం బెంగుళూరులోని ఓ బార్‌లో జరిగిన వివాదంలో బుల్లితెర నటి చిక్కుకుంది. తప్పతాగడంతో నిషా తలకెక్కింది. దీంతో నానా హంగామా చేయడమే కాకుండా, తనకు పార్టీ ఇచ్చిన ఓ ప్రముఖుడి కుమారుడిపై ఏకంగా పోలీసులకు ఫి
ఐటీ నగరం బెంగుళూరులోని ఓ బార్‌లో జరిగిన వివాదంలో బుల్లితెర నటి చిక్కుకుంది. తప్పతాగడంతో నిషా తలకెక్కింది. దీంతో నానా హంగామా చేయడమే కాకుండా, తనకు పార్టీ ఇచ్చిన ఓ ప్రముఖుడి కుమారుడిపై ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మత్తు దిగడంతో అయ్యోబాబోయ్.. క్షమించండి అంటూ ప్రాధేయపడింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
గత ఆదివారం రాత్రి బెంగళూరు యూబీ సిటీ 17వ అంతస్తులోని స్కైబార్‌లో పలువురు యువతీయువకులు కలిసి పీకలవరకు మద్యం సేవించారు. ఆ తర్వాత వారంతా గొడవపడి పరస్పరం బూతులు తిట్టుకుంటూ పరస్పరం కొట్టుకున్నారు. మొత్తం ఏడుగురు స్నేహితుల ఈ బృందంలో బుల్లితెర నటి నిరూషా కూడా ఉన్నారు.
దీంతో ఈ హంగామా శృతిమించిపోవడంతో ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు దర్శన ఒక దశలో హద్దుమీరి బుల్లితెర నటి నిరూషాపై దాడికి ప్రయత్నించాడు. ఈ పరిణామంలో ఖంగుతిన్న ఆమె స్నే హితులతో కలిసి నేరుగా కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషనకు వెళ్లి ఫిర్యాదు చేసింది.
ఈ లోపు నిషా దిగిన దర్శన తప్పయింది క్షమించమంటూ లేఖరాయడంతో కథ సుఖాంతమైంది. నిరూషా కూడా దర్శన్‌పై చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకునేందుకు సమ్మతించింది. అడపాదడపా స్కైబార్‌లో ఇలాంటి ఘటనలు సంభవిస్తున్నాయని పోలీసులు వెల్లడించారు.