Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యువతులను వేధిస్తున్న పోకిరీకి తగిన శాస్తి.. బట్టలూడదీసి.. మెడలో చెప్పులు వేసి..?

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై దురాగతాల సంఖ్య పెరిగిపోతున్నాయి. యువతులను వేధిస్తున్న పోకిరీలు కూడా పెట్రేగిపోతున్నారు. కానీ తాజాగా ఓ పోకిరీకి స్థానికులు సరైన బుద్ధి చెప్పారు

Advertiesment
Tumakuru crime news
, గురువారం, 19 జనవరి 2017 (11:06 IST)
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై దురాగతాల సంఖ్య పెరిగిపోతున్నాయి. యువతులను వేధిస్తున్న పోకిరీలు కూడా పెట్రేగిపోతున్నారు. కానీ తాజాగా ఓ పోకిరీకి స్థానికులు సరైన బుద్ధి చెప్పారు. యువతులను వేధిస్తున్న పోకిరీకి తుమకూరు జిల్లా గుబ్బి తాలూకాలో స్థానికులు వినూత్నంగా శిక్షించారు. అయితే దళితుడైనందుకే శిక్షించారని సదరు యువకుడి తల్లిదండ్రులు గుబ్బి పోలీస్‌ స్టేషనలో ఫిర్యాదు చేశారు. 
 
గుబ్బికి చెందిన 20 ఏళ్ల అభిషేక్‌ ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన యువతి బంధువులు ఆమెతోనే ఫోన్ చేయించి తోటకు రప్పించారు. బట్టలు ఊడదీసి మెడలో చెప్పులు వేసి యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తే ఇదేగతి అని పలకలో రాసి మెడలో వేశారు. సదరు ఫొటోలను వాట్సప్‌ ద్వారా పంపారు. విషయం తెలుసుకున్న అభిషేక్‌ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ చిదానందమూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణలు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజువయ్యా.. మహరాజువయ్యా... వైఎస్ఆర్ కాదట.. ఇంకెవరు?