Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజువయ్యా.. మహరాజువయ్యా... వైఎస్ఆర్ కాదట.. ఇంకెవరు?

సాధారణంగా ప్రజాప్రతినిధి అయిన తర్వాత ఆ పదవిని ఎవ్వరు వదలరు. ఎన్నికలయ్యేంత వరకు ఆ పదవిని పట్టుకుని ఊగిసలాడుతుంటారు. ప్రస్తుతం ఉన్న పదవి కన్నా ఇంకా పెద్ద పదవి కోసం పాకులాడుతుంటారు. కానీ చిత్తూరు జిల్లాల

రాజువయ్యా.. మహరాజువయ్యా... వైఎస్ఆర్ కాదట.. ఇంకెవరు?
, గురువారం, 19 జనవరి 2017 (10:57 IST)
సాధారణంగా ప్రజాప్రతినిధి అయిన తర్వాత ఆ పదవిని ఎవ్వరు వదలరు. ఎన్నికలయ్యేంత వరకు ఆ పదవిని పట్టుకుని ఊగిసలాడుతుంటారు. ప్రస్తుతం ఉన్న పదవి కన్నా ఇంకా పెద్ద పదవి కోసం పాకులాడుతుంటారు. కానీ చిత్తూరు జిల్లాలో ఒక రాజకీయ నాయకుడు మాత్రం పదవిని పోగొట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. అది కూడా పార్టీ అధినేత కోసం కాదు. అధినేత కుమారుడి కోసం. వచ్చిందే ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి. గెలిచింది మాత్రం గతంలో ఉన్న పార్టీ జెండాపై. కానీ త్యాగం చేసేది మాత్రం జంప్ అయిన పార్టీ నాయకుడి కోసం.. ఇదంతా వింటుంటే తికమకగా అనిపిస్తున్నా.. జరిగింది మాత్రం అక్షర సత్యం. ఇంతకీ ఆ నాయకుడు ఎవరూ తెలుసుకుందామా...
 
హెడ్డింగ్ చూసిన తర్వాత రాజువయ్యా.. మహరాజువయ్యా.. అంటే వైఎస్ఆర్. ప్రతి ఒక్కరికి గుర్తుకొస్తారు. కానీ కొంతమంది పాత వారికి మాత్రం శోభన్‌‌బాబు గుర్తొకు వస్తారు. అయితే వీరిద్దరికి ఆ క్యాప్షన్ కాదు. చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి కోసం బాగా సూటవుతుంది. తెలుగుదేశంపార్టీలో చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఉండి.. సీనియర్‌ నేతగా ఎదిగారు అమరనాథ రెడ్డి. టిడిపి అధినేతతోనే మంచి ర్యాపో ఉన్న అమరనాథరెడ్డి ఎన్నికల సమయంలో మాత్రం పార్టీ అధినేతపై అలిగి వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వైఎస్‌‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే పేరుకే ఎమ్మెల్యేగా గెలిచినా తన నియోజవకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేకపోయారు. కారణం నిధులు రాకపోవడమే. 
 
అదొకటే కాదు. వైఎస్‌‌ఆర్ కాంగ్రెస్‌లో జగన్ నుంచి చీవాట్లు మొదలయ్యాయి. చీటికి మాటికి జగన్ తిట్టడాన్ని అమర్ జీర్ణించుకోలేకపోయారు. ఇంకేముంది మెల్లమెల్లగా టిడిపి వైపు అడుగులు వేసి సొంత గూటిలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అంతా సజావుగా అనుకున్నారు. ఇంతలో ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే నారా లోకేష్‌కు మంత్రి పదవి. ఏ పదవి ఇవ్వాలోనన్న ఆలోచనతో పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్‌ నేతలందరితో బాబు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో నారా లోకేష్‌ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలా.. లేకుంటే పరోక్షంగా నామినేటెడ్‌ పోస్టులు ఇవ్వాలా అన్న ఆలోచనలో పడ్డారు. సీనియర్ నేతలందరూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకువద్దామని చెప్పుకొచ్చారు. ఆ సమయంలోనే ఎక్కడి నుంచి పోటీ చేయించాలా అన్నది చర్చ లేచింది.
 
ఏదో ఒక నియోజకవర్గం నుంచి నిలబెట్టి చినబాబు (నారాలోకేష్‌)ను గెలిపించుకుందామని అందరూ సూచించారు. కొంతమంది అయితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేని రాజీనామా చేయించి ఆ ప్రాంతం నుంచే నిలబెట్టి భారీ మెజారిటీతో గెలిపించుకుందామని సలహా ఇచ్చారు. దీంతో వెంటనే అమరనాథరెడ్డి పైకి లేచారు. నా నియోజకవర్గం పలమనేరు నుంచి చినబాబును రంగంలోకి దింపండి.. నేను రాజీనామా చేస్తానంటూ చెప్పారు. అంతేకాదు చినబాబును భారీ మెజారిటీతో గెలిపిస్తానని హామీ ఇచ్చాడు. దీంతో అధినేత బాబు ఆశ్చర్యపోయారు. ఇంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్ నేతలుంటే అమరనాథరెడ్డి మాత్రం పైకి లేవడంపై చర్చకు దారితీసింది. అది కూడా పార్టీ నుంచి జంప్ అయి వచ్చిన ఎమ్మెల్యే తన పదవిని త్యాగం చేసేందుకు సిద్ధమవుతున్నాడంటే గ్రేట్ అంటూ చెవులు కొరుక్కోవడం ప్రారంభించాడు.
 
ఇంతలో మరో సీనియర్ ఎమ్మెల్యే లేచి ఉన్న ఎమ్మెల్యేని రాజీనామా చేయిస్తే బాగుండదు.. ఈ ప్రతిపాదనను తిరస్కరిద్దామని చెప్పడం ప్రారంభించారు. దీంతో అధినేత మరోసారి ఆలోచనలో పడ్డారు. ఇలా అమరనాథరెడ్డి నిర్ణయం కాస్త వేస్టయిపోయింది. కానీ అధినేత దృష్టిలో మాత్రం తాను రాజుగా మిగిలిపోయాయని అనుకుంటున్నారు అమరనాథరెడ్డి. ఎవరూ చేయలేని త్యాగం చేయడానికి అమరనాథరెడ్డి సిద్ధమవడం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్నమ్మకు వణుకు పుట్టిస్తున్న జయలలిత మేనకోడలు