Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీలో దినకరన్... నగరంలో దట్టంగా సుడిగాలి, చిమ్మచీకట్లు... అరెస్టు చేస్తారా?(Video)

కొన్ని సంఘటనలు అలా జరిగిపోతుంటాయి మరి. త‌మిళ‌నాడులోని ఆర్కే నగర్‌ ఉపఎన్నికలో అన్నాడీఎంకే శశికళ వర్గం తరఫున బరిలో నిలిచిన ఆమె మేనల్లుడు దినకరన్ పోలీసుల విచారణ నిమిత్తం ఢిల్లీ వచ్చారు. ఆ వింత ఏమిటో గానీ, ఆయన వచ్చిన కొద్ది క్షణాలకే ఢిల్లీ నగరం కారుచీకట్

ఢిల్లీలో దినకరన్... నగరంలో దట్టంగా సుడిగాలి, చిమ్మచీకట్లు... అరెస్టు చేస్తారా?(Video)
, శనివారం, 22 ఏప్రియల్ 2017 (17:17 IST)
కొన్ని సంఘటనలు అలా జరిగిపోతుంటాయి మరి. త‌మిళ‌నాడులోని ఆర్కే నగర్‌ ఉపఎన్నికలో అన్నాడీఎంకే శశికళ వర్గం తరఫున బరిలో నిలిచిన ఆమె మేనల్లుడు దినకరన్ పోలీసుల విచారణ నిమిత్తం ఢిల్లీ వచ్చారు. ఆ వింత ఏమిటో గానీ, ఆయన వచ్చిన కొద్ది క్షణాలకే ఢిల్లీ నగరం కారుచీకట్లు కమ్ముకుని నల్లగా మారిపోయింది. భారీ దుమ్ము, ధూళి మేఘాలు కొద్దిసేపు అతలాకుతలం చేశాయి. దీనిపై ఇప్పటికే కొందరు సెటైర్లు పడేస్తున్నారనుకోండి.
 
ఇదిలావుంటే అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం కోసం ఏకంగా ఎన్నికల అధికారికే రూ. 50 కోట్ల లంచం ఇవ్వజూపారన్నది దినకరన్ పైన ఆరోపణ. దీనిపై ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల వద్ద ఆధారాలున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో దినకరన్ కు సమన్లు ఇవ్వగా... రేపు వస్తా... మరో రెండ్రోజుల్లో వస్తానంటూ కాలం గడిపేందుకు చూశారట. ఐతే ఢిల్లీ పోలీసులు లుకవుట్ నోటీసులు జారీ చేసేసరికి ఇక చేసేది లేక ఢిల్లీ పోలీసుల విచారణకు ఇవాళ దినకరన్ వచ్చారు. 
 
ఆయనను ఢిల్లీ పోలీసులు ప్రశ్నిస్తుంటే... అసలు చంద్రశేఖరన్ ఎవడో నాకు తెలీదు అనే మాట తప్ప ఇంకేమీ మాట్లాడటం లేదట. చంద్రశేఖర్ మీ పేరు చెప్పారు కదా అని అడిగితే మళ్లీ అదే సమాధానం. వాడెవడో నాకు తెలీదు... ఈ మాట తప్ప మరో మాట మాట్లాడటం లేదట. దీనితో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి తమదైన శైలిలో విచారణ చేపడుతారేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఢిల్లీ కారుచీకట్లకు కారణం ఏమిటో? ప్రస్తుతం ఆ చీకట్లను ఇప్పటికిప్పుడు చూడలేం కానీ... ఈ వీడియో చూడండి...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నారా లోకేష్‌కు ఎలా మాట్లాడాలో శిక్షణ ఇప్పించండి.. మంత్రి పదవి అవసరమా?: అంబటి