Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నారా లోకేష్‌కు ఎలా మాట్లాడాలో శిక్షణ ఇప్పించండి.. మంత్రి పదవి అవసరమా?: అంబటి

సామాజిక మాధ్యమాలపై కొరడా ఝుళిపించడం ఏపీలోని చంద్రబాబు సర్కారుకు ఏమాత్రం తగదని వైకాపా నేత అంబటి రాంబాబు అన్నారు. సోషల్ మీడియాలో అన్నీ నిజాలే పోస్ట్ చేస్తారని తాను అనుకోవట్లేదని.. కానీ వాటిలో వాస్తవాలకు

Advertiesment
ambati ram babu
, శనివారం, 22 ఏప్రియల్ 2017 (17:00 IST)
సామాజిక మాధ్యమాలపై కొరడా ఝుళిపించడం ఏపీలోని చంద్రబాబు సర్కారుకు ఏమాత్రం తగదని వైకాపా నేత అంబటి రాంబాబు అన్నారు. సోషల్ మీడియాలో అన్నీ నిజాలే పోస్ట్ చేస్తారని తాను అనుకోవట్లేదని.. కానీ వాటిలో వాస్తవాలకు దగ్గరగా పోస్టులు ఉంటాయని ప్రజలు భావిస్తున్నారని అంబటి వ్యాఖ్యానిచారు. ప్రస్తుతం కాలంలో సోషల్ మీడియా ఫిప్త్ ఎస్టేట్‌గా మారిందని.. దానిపై ఆంక్షలు సరికాదని అంబటి హితవు పలికారు. 
 
విమర్శలు చేసిన పాపానికే పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్‌ను అరెస్ట్ చేశారా అంటూ అంబటి నిలదీశారు. అసలు రవికిరణ్‌ను ఎందుకు అరెస్ట్ చేసారని, ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టకుండా ఎందుకు వదిలిపెట్టేశారో చెప్పాలని అంబటి అడిగారు. 
 
ఇలాంటి అరెస్టులు చేయడం కంటే మంత్రి నారా లోకేష్‌కు ఎలా మాట్లాడాలో నేర్పిస్తే మంచిదని అంబటి సూచించారు. ఓ పరిణితి లేని వ్యక్తి ఇలా మూడు శాఖల పగ్గాలు ఇవ్వడం ఇలాంటి పరిస్థితికే దారితీస్తుందని విమర్శలు గుప్పించారు. మంత్రి పదవికి టీడీపీ యువ‌నేత నారా లోకేశ్‌ అనర్హుడని అంబ‌టి రాంబాబు అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శాంసంగ్ ఫోన్ తయారీకి రూ.19,500 ఖర్చైతే.. అమ్మకపు ధర మాత్రం రూ.57,900?