Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శాంసంగ్ ఫోన్ తయారీకి రూ.19,500 ఖర్చైతే.. అమ్మకపు ధర మాత్రం రూ.57,900?

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్‌ గురించి కొత్త రిపోర్ట్ విడుదలైంది. శాంసంగ్ నుంచి విడుదలై గెలాక్సీ ఎస్8 గురించి ఆసక్తికరమైన సమాచారం ఓ నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చింది. శాంసంగ్ స్మార్ట్ పోన్ గెలాక్

శాంసంగ్ ఫోన్ తయారీకి రూ.19,500 ఖర్చైతే.. అమ్మకపు ధర మాత్రం రూ.57,900?
, శనివారం, 22 ఏప్రియల్ 2017 (14:55 IST)
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్‌ గురించి కొత్త రిపోర్ట్ విడుదలైంది. శాంసంగ్ నుంచి విడుదలై గెలాక్సీ ఎస్8 గురించి ఆసక్తికరమైన సమాచారం ఓ నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చింది. శాంసంగ్ స్మార్ట్ పోన్ గెలాక్సీ నోట్ 7ను తయారీ ఖర్చుతో పోలిస్తే రూ.26,700 అధికంగా అమ్ముతున్నారని తెలిసింది. ఈ ఫోన్ తయారీకి చాలా తక్కువగా ఖర్చైనట్లు నివేదికలోని వివరాల ద్వారా వెల్లడి అయ్యింది. 
 
ఈ క్రమంలో తాజా రిపోర్టు ప్రకారం ఎస్8 స్మార్ట్ ఫోన్ తయారీకి రూ. 19,500 కాగా, దీన్ని రూ. 57,900కు అమ్ముతున్నారని తేలింది. అంతేగాకుండా.. ఈ నివేదిక ప్రకారం, విడి భాగాలను అమర్చేందుకు అయిన ఖర్చు రూ.392 అని, గెలాక్సీ ఎస్7 కన్నా రూ. 2,800 ఎక్కువ ఖర్చు పెట్టారని, ఇదే సమయంలో ఎస్ 7 ఎడ్జ్‌తో పోలిస్తే రూ. 2,300 తక్కువని, బ్యాటరీ ధర కేవలం రూ. 291 మాత్రమేనని వెల్లడించింది. 
 
కానీ తయారీకి ఖర్చు తక్కువే అయినప్పటికీ.. అధికంగా అమ్ముతున్న మొత్తం ద్వారా పన్నులు, రీటైల్ మార్జిన్, పన్నులు వంటి వాటికి ఈ మొత్తాన్ని ఉపయోగిస్తారని.. ఇదంతా కంపెనీకి లాభంగా మిగులుతుందని చెప్పలేమని ఆ నివేదిక ద్వారా తేలింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్‌కు దిమ్మతిరిగే షాక్... రజినీకాంత్‌కు భారత రాష్ట్రపతి పదవి? భాజపా ప్లాన్స్..!!?