పవన్‌కు దిమ్మతిరిగే షాక్... రజినీకాంత్‌కు భారత రాష్ట్రపతి పదవి? భాజపా ప్లాన్స్..!!?
ఉత్తరాది అహంకారం, దక్షిణాది ఆత్మగౌరవం అంటూ దక్షిణాదిని మొత్తం కలుపుతూ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాది వారికి దక్షిణాది అంటే చిన్నచూపు అని కూడా చెప్పారు. ఈ నేపధ్యంలో కేంద్రంలోని భాజపా ఓ మాస్టర్ స్కెచ్ గ
ఉత్తరాది అహంకారం, దక్షిణాది ఆత్మగౌరవం అంటూ దక్షిణాదిని మొత్తం కలుపుతూ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాది వారికి దక్షిణాది అంటే చిన్నచూపు అని కూడా చెప్పారు. ఈ నేపధ్యంలో కేంద్రంలోని భాజపా ఓ మాస్టర్ స్కెచ్ గీసినట్లు తెలుస్తోంది. దక్షిణాదికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చే పనిని చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఇది కనుక నిజమే అయితే అటు దక్షిణాది మొత్తం ఒక్కసారిగా ప్రధానమంత్రి మోదీ వైపు చూడటం ఖాయమే. అలాగే ఇది జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌కు దిమ్మతిరిగే షాకింగ్ న్యూస్ కూడా అవ్వొచ్చంటున్నారు. ఇంతకీ భాజపా వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటయా అంటే... దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ కు భారత రాష్ట్రపతి పదవి కట్టబెట్టడమేనట.
ప్రస్తుతం ఈ వార్త సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో తిరుగుతోంది. ఇప్పటికే బాబ్రీ కేసులో ఇరుక్కున్న ఎల్కే అద్వానీ తను రాష్ట్రపతి రేసులో లేనని తెలిపారు. అలాగే అమితాబ్ బచ్చన్ పేరు కూడా ఈ పదవికి వినబడింది కానీ ఆ తర్వాత అంతగా చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు రజినీకాంత్ పేరు ప్రముఖంగా వినబడుతోంది.
రజినీకాంత్ వివాదాలకు దూరంగా వుండటమే కాకుండా దేశ వ్యాప్తంగా ఆయనకు మంచి ఫాలోయింగ్ వుంది. పైగా నరేంద్ర మోదీ కూడా ఆయనను రాష్ట్రపతి పదవికి ఎంపిక చేసేందుకు ఇష్టతను ప్రదర్శిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు రాష్ట్రపతి ఎన్నికల్లో తమిళనాడు ఓట్లు కీలకం కానున్నాయి. రజీనీకాంత్ కు పదవి కట్టబెట్టడం ద్వారా దక్షిణాదిలో భాజపా పాగా వేసేందుకు మంచి అవకాశం కుదురుతుందని అనుకుంటున్నారు. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ.