హనీట్రాప్‌కు ఓ పెద్దాయన మోసపోయాడు. కిలాడీ మహిళల మాటలు నమ్మి.. వారి వలపు వలలో చిక్కుకున్నాడు. చివరికి మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. మా అబ్బాయి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడని.. వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం చేయాలంటూ 40 ఏళ్ల మహిళ 60 ఏళ్ల పెద్దాయనకు ఫోన్ చేసింది.
వీరికి ముందుగానే కాస్త పరిచయం వుండటంతో మాటలు కలిశాయి. అడిగేసరికి కాదనలేక పెద్దాయనతో ఇచ్చేయడం చేశాడు. ఇలా ఎన్నోసార్లు 60 ఏళ్ల వ్యక్తి డబ్బు గుంజేసిన మహిళ.. తోడుకు ఆమె చెల్లెల్ని కూడా రంగంలోకి దించింది.
ఈ క్రమంలో హోటల్‌లో రెండు, మూడుసార్లు కలిసి కాలం గడపడంతో అసలు సంగతి బయటపడింది. చెల్లి ఫోనులో వీడియోలు, ఫోటోలు తీశామని.. డబ్బులు ఇవ్వకపోతే.. రాసలీలల వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించారు. ఇలా బెదిరించి, సాయం పేరుతో రూ.82 లక్షలు గుంజారు. అంతేగాకుండా మరో రూ.40 లక్షలు కావాలంటూ ఒత్తిడి పెంచారు.
ఆ సొమ్ము ఇవ్వకపోతే.. నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డావంటూ కేసు పెడతామని హెచ్చరించడంతో.. 60 ఏళ్ల వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన కర్ణాటక, బెంగళూరు, ఉత్తరహళ్లిలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. ఇద్దరు మహిళల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.