పిల్ల ఏనుగు నీటిలో కొట్టుకుపోతే.. పెద్ద ఏనుగులు కాపాడాయి.. తొండంతో?
అనురాగం, ఆత్మీయత జంతువులకైనా, మనుషులకైనా ఒకటేనని గజరాజులు నిరూపించాయి. ఒడిశాలోని కియోంఝర్‌లో ఆదివారం అలాంటి ఘటనే జరిగింది. దానిని చూసిన స్థానికులు కంటతడిపెట్టారు. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంత
అనురాగం, ఆత్మీయత జంతువులకైనా, మనుషులకైనా ఒకటేనని గజరాజులు నిరూపించాయి. ఒడిశాలోని కియోంఝర్‌లో ఆదివారం అలాంటి ఘటనే జరిగింది. దానిని చూసిన స్థానికులు కంటతడిపెట్టారు. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఆదివారం వైతరణి నది ప్రవాహం విపరీతంగా ఉంది. మేత కోసం వెళ్ళిన ఏనుగులు ఆ ప్రదేశానికి వచ్చాయి. వాటితో పాటు మూడు నెలల పసి కూన కూడా ఉంది.
ఆ పిల్ల ఏనుగు అడుగులో అడుగేసుకుంటూ ముచ్చటగా నడుచుకెళ్లింది. అయితే ఆ పిల్ల ఏనుగు జారిపోయి నీటిలో కొట్టుకుపోతోంది. వెంటనే పెద్ద ఏనుగులు తొండాలతో ఆ పిల్ల ఏనుగును కాపాడాయి. ఈ సన్నివేశాన్ని చూసిన గ్రామస్థులు గజరాజుల కష్టాలు చూసి చలించిపోయారు. వాటికి మేత కోసం కొబ్బరి కాయలు, గడ్డి తీసుకెళ్ళారు. అయితే మనుషులను చూసి అవి జడుసుకుంటున్నారు.