Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అయోధ్యలో రామాలయ నిర్మాణం తథ్యం.. కానీ అది జరిగే వరకు..?: తొగాడియా

అయోధ్య.. అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది శ్రీరాముడే. రాముని జన్మభూమి అయిన ఈ ప్రాంతం ఉత్తర ప్రదేశ్‌లోని ఫైజాబాద్ జిల్లా సరయూ నది ఒడ్డున వెలసిన ఒక చారిత్రక నగరంగా వెలసింది. రామాయణ కథ ప్రకారం ... నరయూ నది

Advertiesment
అయోధ్యలో రామాలయ నిర్మాణం తథ్యం.. కానీ అది జరిగే వరకు..?: తొగాడియా
, మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (15:25 IST)
అయోధ్య.. అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది శ్రీరాముడే. రాముని జన్మభూమి అయిన ఈ ప్రాంతం ఉత్తర ప్రదేశ్‌లోని ఫైజాబాద్ జిల్లా సరయూ నది ఒడ్డున వెలసిన ఒక చారిత్రక నగరంగా వెలసింది. రామాయణ కథ ప్రకారం ... నరయూ నది ఒడ్డున రాముడు మొదటి పట్టణాన్ని కట్టి దానికి అయోధ్య అని పేరు పెట్టాడు. ఐరావతి, నరయూ నదుల మధ్యలో అయోధ్య ఉండేదని మహాభారతంలో కూడా పేర్కొనబడింది.  
 
అయోధ్యలోని రామ్ కోట్ వార్డ్‌లోని ప్రత్యేక ప్రదేశం శ్రీరాముడు పుట్టిన అసలు ప్రదేశం. దీనినే రామ్ జన్మ భూమి‌గా పిలుస్తారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రామ నిర్మాణం ఏర్పాటుపై సుప్రీం కోర్టులో వాదనలు పెండింగ్‌లో ఉన్న తరుణంలో అయోధ్యలో రామాలయ నిర్మాణం అంశాన్ని విశ్వహిందూ పరిషత్ కీలక నాయకుడు ప్రవీణ్ తొగాడియా మరోసారి ప్రస్తావించారు. 
 
రామాలయ నిర్మాణం జరిగి తీరుతుందని తెలిపారు. పాట్నాలో జరిపిన పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామాలయం విషయంలో వీహెచ్‌పీ వెనుకంజ వేసేది లేదని, ఆలయ నిర్మాణం తథ్యమన్నారు. అయితే వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసేంత వరకూ ఆలయ నిర్మాణం గురించి విశ్వహిందూ పరిషత్ ఎలాంటి ఆందోళనలు చేపట్టదన్నారు. బీహార్‌లో మద్యపాన నిషేధానికి తొగాడియా తన మద్దతు ప్రకటించారు. మద్యనిషేధానికి బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుక్క తోక వంకర.. ముఫ్తీ తీరూ అంతే.. ఆమెకు టెర్రరిస్టులతో లింకుంది: సుబ్రహ్మణ్య స్వామి