లేడీ కానిస్టేబుల్‌‌పై ఏఎస్ఐ ఓవరాక్షన్.. కాలిబూటుతో చెంప పగలకొట్టింది..

గురువారం, 13 డిశెంబరు 2018 (12:26 IST)
మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలు జరుగుతున్నాయి. అర్థరాత్రి పూట విధుల్లో వున్న లేడి కానిస్టేబుల్‌తో ఓ ఏఎస్ఐ అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. అంతే అతడిని కాలిబూటుతో చెంప పగులకొట్టింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి సోమరసంపేట పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. సోమరసం పేట స్టేషన్లో బాలసుబ్రమణి (50) ఏఎస్ఐ పనిచేస్తున్నారు. రాత్రి నగరంలో గస్తీకి వెళ్లి తిరిగొచ్చిన ఏఎస్ఐ.. స్టేషన్‌లోని కంప్యూటర్‌ విభాగంలో డ్యూటీ చేస్తున్న మహిళా కానిస్టేబుల్‌తో దారుణంగా ప్రవర్తించాడు. అభ్యంతరకరమైన మాటలతో విసిగించాడు. అతడి మాటలకు కోపంతో ఆ కానిస్టేబుల్ కుర్చీ నుంచే లేవగానే ఏఎస్ఐ ఆమెను అసభ్యంగా తాకడం ప్రారంభించాడు. అతని ప్రవర్తనకు షాకైన ఆమె అతనిపై ఎదుదాడికి దిగింది. తన కాలిబూటుతో చెంప పగులకొట్టింది. అతడు కిందపడిపోగానే.. వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. 
 
చివరికి ఏఓఎస్ఐ ఇంటికెళ్లిపోవడంతో.. మళ్లీ స్టేషన్లోకి వచ్చిన బాధితురాలు.. కంప్యూటర్ విభాగంలో సీసీ కెమెరాలో ఏఎస్‌ఐ తనతో అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాలను తన పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసుకుని వెళ్లిపోయింది. మంగళవారం ఆ వీడియో ఆధారాలతో తిరుచ్చి ఎస్పీ కార్యాలయంలో సుబ్రమణిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఆ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సుబ్రమణిని సస్పెండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం తండ్రిపై నాలుగేళ్ళ చిన్నారి ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?