ఒక్క కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ నేతలకే కాదు.. పొరుగున ఉన్న తమిళనాడులోని రాజకీయ నేతలకు సైతం ఆంధ్రోళ్ళు అంత అలుసుగా కనిపిస్తోంది. అందుకే నోటికి ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడుతుంటారు.
తాజాగా తమిళనాడు గవర్నర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యపై తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ముడుపులు ఆరోపణలు చేశారు. తమిళనాడులోని విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల నియామకంలో ముఖ్యమంత్రి జయలలిత ఇచ్చిన ముడుపులు తీసుకుని వీసీల నియామకం చేపట్టారంటూ ఆరోపించారు.
ఈ ఆరోపణలు రోశయ్య మనస్సును నొప్పించాయి. దీంతో ఇళంగోవన్‌పై పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని, ముఖ్యమంత్రికి, గవర్నర్ కు అపకీర్తి తెచ్చేలా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఆయనపై పరువు నష్టం దావా వేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.