Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోదీ పెద్దపులా.. అబ్బే.. చిట్టెలుక అంటున్న తృణమూల్

మద్దతుదారులు చెబుతున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ పెద్దపులి కాదని, గుజరాత్‌లో తన కలుగులోకి చిట్టెలుకలా మోదీ దూరే రోజు ఒకటి త్వరలోనే వస్తుందని తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర వ్యాఖ్య చేసింది.

మోదీ పెద్దపులా.. అబ్బే..  చిట్టెలుక అంటున్న తృణమూల్
హైదరాబాద్ , గురువారం, 12 జనవరి 2017 (06:01 IST)
మద్దతుదారులు చెబుతున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ పెద్దపులి కాదని, గుజరాత్‌లో తన కలుగులోకి చిట్టెలుకలా మోదీ దూరే రోజు ఒకటి త్వరలోనే వస్తుందని తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర వ్యాఖ్య చేసింది. శారదా చిట్‌ఫండ్ స్కాంలో తమ పార్టీ నేతలను సీబీఐ అరెస్టు చేసిన నేపధ్యంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ప్రధాని మోదీని చిట్చెలుకగా పోల్చి నిందించారు. 
 
మోదీ సానుభూతిపరులు ఆయన్ని పెద్దపులి అని పిలుస్తుంటారు. అయితే గుజరాత్ లోని తన కలుగులోకి మోదీ చిట్టెలుకలా తిరిగివచ్చే రోజు ఇంకెంతో దూరం లేదు అని కల్యాణ్ బెనర్జీ కలకత్తాలో జరిగిన ఒక ర్యాలీ సందర్భంగా ప్రధానిపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. మోదీపై కల్యాణ్ వ్యాఖ్యలు మీడియోలో తీవ్ర విమర్శల పాలయ్యాయి కానీ ఆ తర్వాత కూడా ఆయన మోదీపై నిందాత్మక భాషను వాడినందుకు క్షమాపణ చెప్పలేదు.పైగా మీడియా మొత్తంగా మోదీకి అనుకూలంగా ఉందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలను అసభ్యకర పదాలతో తిట్టడం మోదీతోటే మొదలైందని చెబుతూ కల్యాణ్ తన వ్యాఖ్యలను సమర్థంచుకున్నారు. 
 
తృణమూల్ ఎంపీ ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బలపర్చారు. పైగా నరేంద్రమోదీ ప్రభుత్వంపై దాడి చేయడానికి ఆమె కూడా చిట్టెలుక పదప్రయోగం చేశారు. టీఎంసీ మెత్తటి బురదపై ఉందని, సులభంగా దాన్ని లేపేయవచ్చని వాళ్లు అనుకుటున్నారు. బురద మెత్తగా ఉన్నప్పుడు ఎలుకలు సైతం దాన్ని తోడేయడానికి ప్రయత్నిస్తాయి. కాని తృణమూల్ కాంగ్రెస్ గట్టినేలపై నిలదొక్కుకుంది. ఎలాంటి ఎలుకలూ మమ్మల్నేం చేయలేవు. మేం పెద్దపులులతోటే పోరాడతాం అని మమత అన్నారు. 
 
మరోవైపు బీజేపీ మాత్రం మోదీని నిందించిన తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై కేసు పెట్టింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నగదు రహితం అక్కడ చెల్లుతుందా మోదీజీ : చిదంబరం సవాల్