Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నగదు రహితం అక్కడ చెల్లుతుందా మోదీజీ : చిదంబరం సవాల్

దేశమంతా నగదు రహిత వ్యవస్ఖే అంటూ ప్రచార జోరును పెంచిన ప్రధాని నరేంద్ర మోదీకి మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం సవాల్ విసిరారు. ఈ వేసవిలో తమ పిల్లల కేపిటేషన్ ఫీజును వైద్య, ఇంజనీరింగ్ కళాశాలలకు నగదు రూపంలో చెల్లించవద్దనే హామీని తల్లిదండ్రులకు మోదీ ఇప్వగలరా

నగదు రహితం అక్కడ చెల్లుతుందా మోదీజీ : చిదంబరం సవాల్
హైదరాబాద్ , గురువారం, 12 జనవరి 2017 (05:20 IST)
దేశమంతా నగదు రహిత వ్యవస్ఖే అంటూ ప్రచార జోరును పెంచిన ప్రధాని నరేంద్ర మోదీకి మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం సవాల్ విసిరారు. ఈ వేసవిలో తమ పిల్లల కేపిటేషన్ ఫీజును వైద్య, ఇంజనీరింగ్ కళాశాలలకు నగదు రూపంలో చెల్లించవద్దనే హామీని తల్లిదండ్రులకు మోదీ ఇప్వగలరా అంటూ చిదంబరం సవాలు విసిరారు. ఇంతవరకు పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల వైద్య ఇంజనీరింగ్ సీట్లకోసం ఆయా కాలేజీలకు నగదురూపంలో కాపిటేషన్ ఫీజును చెల్లిస్తూ వస్తున్నారు. 
 
ఈ మే, జూన్ నెలల్లో ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలను తెరుస్తారు. క్యాపిటేషన్ ఫీజును తీసుకుంటారు. కానీ ఈసారి పిల్లల తల్లిదండ్రులకు భయపడవద్దంటూ మోదీ అభయమిస్తారా అని చిదంబరం ఎద్దేవా చేశారు.  తమ పిల్లలను ప్రతిష్టాత్మకమైన ప్రైవేట్ మెడికల్, ఇంజనీరింగ్ కళాశాల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు కాలేజీల యాజమాన్యాలకు క్యాపిటేషన్ ఫీజును భారీగా నగదు రూపంలో చెల్లిస్తుంటారు. ఈసారి మీరు క్యాపిటేషన్ ఫీజు నగదురూపంలో కట్టనవసరం లేదని మోదీ ఆ పిల్లల తల్లిదండ్రులకు అభయమివ్వగలరా అని చిదంబరం ప్రశ్నించారు. 
 
నగదు రహిత సమాజం గురించి ప్రధాని ఊరకే మాటలు చెబుతున్నారు కానీ ప్రపంచంలో ఎక్కడా లేని దాని గురించి ఆయన మాట్లాడుతున్నారు. అంతర్జాతీయంగా నగదు రహిత పరిణామాలను మోదీ తెలుసుకోవాలి. అమెరకాలో నగదు 42 శాతం ఉంటే, ఫ్రాన్సులో 56 శాతం నగదు ఉంటోంది.  నగదు వాడాలా, కార్డు వాడాలా అనేది ప్రజల ఎంపికగానే ఉండాలి. కాని నాయకుల ఇష్టాఇష్టాల బట్టి కాదు అని చిదంబరం హితవు చెప్పారు
 
మన దేశంలో రైతులు, వేతన జీవులు, కూలీలు తన నిత్యావసరాల కోసం డబ్బునే వాడుతుంటారు. పెద్దనోట్లరద్దు లక్ష్యం నకిలీ కరెన్సీ, నల్లధనం, అవినీతి అని ప్రధాని మోదీ ఘనంగా చెప్పారు. తాను చేసిన వాగ్దానాలను మోదీ పరీక్షకు పెడితే అప్పుడు వాస్తవం బోధపడుతుంది. పెద్దనోట్ల రద్దు వల్ల ఘోరంగా దెబ్బతిన్న రైతులకు మోదీ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. పెద్దనోట్ల రద్దు ఉత్పాతం బారినపడి మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి అని పి.చిదంబరం డిమాండ్ చేశారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఎ క్రొకొడైల్ ఫెస్టివల్ అంటున్న మన్మోహన్