పద్మ పురస్కారాల ప్రకటన: ఇళయరాజాకు పద్మ విభూషణ్.. తెలంగాణకు మొండిచేయి
గణతంత్ర దినోత్సవాలు దేశ వ్యాప్తంగా అట్టహాసంగా జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యుత్తమ పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందుకోసం దేశ వ్యాప్తంగా 85 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది. అయితే ఈ పద్మ
గణతంత్ర దినోత్సవాలు దేశ వ్యాప్తంగా అట్టహాసంగా జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యుత్తమ పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందుకోసం దేశ వ్యాప్తంగా 85 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది. అయితే ఈ పద్మ అవార్డుల్లో తెలంగాణకు మొండిచెయ్యి చూపించింది.
ఇంకా బీజేపీ పాలిత రాష్ట్రాలకు.. త్వరలో ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలకూ అవార్డుల్లో పెద్దపీట వేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కరికి మాత్రమే అవార్డు అందగా, తెలంగాణకు అది కూడా లేదు. ఇక ఏపీ నుంచి క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ పేరు పద్మశ్రీకి ఎంపికైంది.
ఇకపోతే..
మహారాష్ట్రకు 11 అవార్డులు
మధ్యప్రదేశ్ కు 4,
గుజరాత్‌కు 3 'పద్మ' అవార్డులు లభించాయి.
కర్ణాటక- 9 అవార్డులు
తమిళనాడుకు 5,
పశ్చిమ బెంగాల్‌కు 5,
కేరళకు 4,
ఒడిశాకు 4 అవార్డులను కేంద్రం ప్రకటించింది. పలు రంగాల్లో సేవలందించిన వారిని ఎంచుకున్న కేంద్రం 9 మందికి పద్మ భూషణ్, 73మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. మహారాష్ట్రకు చెందిన శాస్త్రవేత్త అరవింద్ గుప్తాకు పద్మశ్రీ, కేరళకు చెందిన లక్ష్మి కుట్టికి వైద్య రంగంలో పద్మశ్రీ అవార్డులు దక్కాయి.
రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ను ప్రకటించడంపై మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా హర్షం వ్యక్తం చేశారు. తనకు వచ్చిన ఈ అవార్డును తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు అంకితం చేస్తున్నానని తెలిపారు. కాగా 2010లోనే ఇళయరాజా పద్మ భూషణ్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే.