Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా రోగి ఇంట్లోకి చోరీకొచ్చిన దొంగలు - తాపీగా మటన్ కర్రీ వండుకున్నారు...

కరోనా రోగి ఇంట్లోకి చోరీకొచ్చిన దొంగలు - తాపీగా మటన్ కర్రీ వండుకున్నారు...
, సోమవారం, 20 జులై 2020 (10:14 IST)
చాలా ప్రాంతాల్లో ఒక కుటుంబంలోని సభ్యులంతా కరోనా వైరస్ బారినపడున్నారు. ఇలాంటి వారంతా ఇంటికి తాళం వేసి క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఇలాంటి గృహాలు దొంగలకు మంచి అనుకూలంగా మారాయి. దీంతో తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ ఇంటిని పూర్తిగా లూటీ చేస్తున్నారు. తాజాగా ఓ క్వారంటైన్‌లో ఉన్న రోగి ఇంట్లోకి చోరీకి వచ్చిన దొంగలు.. ఉన్నదంతా దోచుకుని, ఆ తర్వాత మటన్ కర్రీ వండుకుని కడుపునిండా ఆరగించి వెళ్లిపోయారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని జెంషెడ్‌పూర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జెంషెడ్‌పూర్ నగరంలో ఓ ప్రాంతంలో కరోనా కేసులు అధికంగా ఉండటంతో తాన్ని కంటైన్మెంట్ జోనుగా ప్రకటించారు. అక్కడ ఓ కరోనా రోగి ఇల్లు ఉంది. 
 
భర్త ఆస్పత్రిలో ఉండటంతో భార్య.. పిల్లల్ని తీసుకుని స్వగ్రామానికి వెళ్లింది. అధికారుల ఆ ఇంటికి సీల్ వేశారు. నెల రోజులుగా ఆ ఇంట్లో ఎవరూ ఉండటం లేదు. ఇదంతా దొంగలకు బాగా కలిసొచ్చింది. పక్కాగా ప్లాన్ చేసి ఆ ఇంట్లోకి గురువారం అర్థరాత్రి చొరబడ్డారు.
 
అదంతా కంటైన్మెంట్ జోన్ కావడంతో రాత్రిళ్లు అక్కడంతా గప్‌చుప్. ఎవ్వరూ లేరు.. రారు.. కాబట్టి రాజ్యమంతా తమదే అన్నట్టు దొంగలు రెచ్చిపోయారు. అర్థారాత్రి వేళ వారందరూ కలసి మటన్ కర్రీ, చపాతీలు ఒండుకు సుష్టుగా తిన్నారు. 
 
ఆ తర్వాత తీరిగ్గా రూ.50 వేలు, అంతే విలువగల నగలు దోచుకుని జంపైపోయారు. ఓసారి ఇల్లు ఎలా ఉందో చూసిరా అంటూ సదరు కరోనా రోగి తన తమ్ముడికి శుక్రవారం నాడు పురామించడంతో ఈ విషయం బయటపడింది. అదే రోజు అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పన్వెల్ క్వారంటైన్‌లోని మహిళపై అత్యాచారం!!