తలాక్.. తలాక్.. తలాక్ అంటే విడాకులు కాదు.. మహిళలూ ఖురాన్ చదవండి: సల్మా అన్సారీ
ఉప రాష్ట్రపతి హామీద్ అన్సారీ సతీమణి సల్మా అన్సారీ ట్రిపుల్ తలాక్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తలాక్ తలాక్ తలాక్ అంటూ మూడుసార్లు అన్నంత మాత్రాన అది విడాకులు కాబోదని సల్మా అన్సారీ వ్యాఖ్యానించారు. ఎవరో చెప
ఉప రాష్ట్రపతి హామీద్ అన్సారీ సతీమణి సల్మా అన్సారీ ట్రిపుల్ తలాక్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తలాక్ తలాక్ తలాక్ అంటూ మూడుసార్లు అన్నంత మాత్రాన అది విడాకులు కాబోదని సల్మా అన్సారీ వ్యాఖ్యానించారు. ఎవరో చెప్పినదాన్ని గుడ్డిగా నమ్మకూడదని ఆలీఘడ్ లోని ఆల్ నూర్ చారిటబుల్ సోసైటీ చాచా నెహ్రూ మదర్సాలో నిర్వహించిన కార్యక్రమంలో సల్మా అన్సారీ అన్నారు.
దేశవ్యాప్తంగా ట్రిపుల్ తలాక్ పై తీవ్ర చర్చలు జరుగుతుండగా అన్సారీ భార్య సల్మా అన్సారీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తలాక్ తలాక్ తలాక్ అంటే విడాకులు కాబోదని.. ముస్లిం మహిళలకు చెప్తున్నది ఏంటంటే.. ఖురాన్‌ను చదవండని లీలా అన్సారీ కోరారు. ఖురాన్‌ను చదవండి ముస్లిం మత పెద్దలు చెప్పేవాటినే పాటించడం కాకుండా ఖురాన్ చదివితే అందులో ఏముందనేది తెలుస్తోందని సూచించారు.
ముస్లిం మతపెద్దలు వారి భావాలనే చెప్తుంటారని.. మౌలానాలు ఏం చెప్పినా అందరం నిజం అనుకుంటాం. కానీ అరబిక్‌లో ఉన్న ఖురాన్‌ను చదవండి.. అప్పుడే షరియత్ ఏం చెబుతోందో స్పష్టంగా తెలుస్తోందన్నారు.