ఆ న్యూస్ రీడర్‌కు భర్త చనిపోయిన విషయం వార్తగా వచ్చింది.. చివరికి ఏం చేసిందంటే?
ఆ న్యూస్ రీడర్‌కు ఏడాది క్రితమే వివాహం జరిగింది. అయితే లైవ్‌లో వార్త చదువుతుండగా ఓ రోడ్డు ప్రమాదం జరిగిందని... వార్త వచ్చింది. ఆ రోడ్డు ప్రమాదంలో న్యూస్ రీడర్ భర్త చనిపోయాడని తెలిసింది. అయినా ఉబికి వస
ఆ న్యూస్ రీడర్‌కు ఏడాది క్రితమే వివాహం జరిగింది. అయితే లైవ్‌లో వార్త చదువుతుండగా ఓ రోడ్డు ప్రమాదం జరిగిందని... వార్త వచ్చింది. ఆ రోడ్డు ప్రమాదంలో న్యూస్ రీడర్ భర్త చనిపోయాడని తెలిసింది. అయినా ఉబికి వస్తున్న దుఃఖం బయటకు కనిపించకుండా వార్తను మామూలుగానే చదివి తన వృత్తి పట్ల ఉన్న అంకితభావాన్ని చూపింది.. సదరు న్యూస్ రీడర్. బులిటెన్ పూర్తయ్యాక బోరున విలపించింది. బంధువులకు ఫోన్ చేసి జరిగిన దారుణాన్ని తెలుసుకుంది. ఈ ఘటన ఛత్తీస్‌ఘడ్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐబీసీ-24 ఛానల్ న్యూస్ రీడర్ సుప్రీత్ కౌర్ శనివారం ఉదయం లైవ్‌లో వార్తలు చదువుతుండగా.. ముహసాముండ్ జిల్లా ఫిథరా ప్రాంతంలో జాతీయ రహదారిపై రెనో డస్టర్ కారు గుర్తు తెలియని వాహనం ఢీకొని ప్రమాదానికి గురైందని ఫోన్ ఇన్ వచ్చింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు చనిపోయారని, ఇద్దరికి తీవ్రంగా గాయపడ్డారని రిపోర్టర్ చెప్పాడు.
ఈ మార్గంలోనే భర్త హర్షద్ కవాడే రెనో డస్టర్ కారులో వెళ్తుండగా.. ప్రమాదానికి గురైనట్లు తెలుసుకుంది. అయినా బయటకు వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుని వార్తను మామూలుగానే చదివి వృత్తిపట్ల తన అంకితభావాన్ని చూపింది.