Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మళ్లీ మండిన పెట్రోల్ ధర

Advertiesment
price
, గురువారం, 7 జనవరి 2021 (12:26 IST)
పెట్రో ధరల పెరుగుదల మళ్లీ మొదలైంది. లీటరు పెట్రోల్‌ ధరను 26పైసలు, డీజిల్‌ ధరను 25 పైసలు పెంచాయి ప్రభుత్వ రంగంలోని చమురు విక్రయ కంపెనీలు. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.83.71 నుంచి రూ.83.97కు, డీజిల్‌ ధర రూ.73.87 నుంచి రూ.74.12కు చేరుకుంది.

ఇంతకు ముందు ఢిల్లీలో 2018 అక్టోబరు 4న అత్యధికంగా పెట్రోల్‌ ధర రూ.84 స్థాయిని చేరుకుంది. డీజిల్‌ ధర ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయిలో రూ.75.45గా నమోదైంది. ప్రస్తుతం పెట్రోల్‌ ధర ఆల్‌టైమ్‌ హై స్థాయికి చేరువలో ఉంది.
 
ఇక ముంబైలో లీటరు పెట్రోల్‌ ధర రూ.90.60 ఉండగా.. డీజిల్‌ ధర ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయి రూ.80.78ని తాకింది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.87.34 ఉండగా.. డీజిల్‌ ధర రూ.80.88 పలికింది. కాగా ప్రస్తుతం ఇంధనాలపై పన్ను తగ్గించే అంశం పరిశీలనలో లేదని ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు.
 
ఇంతకు ముందు పెట్రో ధరలు గరిష్ఠ స్థాయిని తాకిన ప్పుడు ప్రభుత్వం లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని రూ.1.50 తగ్గించింది. చమురు కంపెనీలు లీటరుపై మరో రూ.1 తగ్గించాయి. దీని వల్ల వాహనదారులపై భారం కాస్త తగ్గే అవకాశం ఏర్పడింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్వరలో 50 వేల సాధువులతో 'చలో రామతీర్థం'