Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరుడి నాగినీ డ్యాన్స్ చూసీ.. వధువు ఏం చేసిందో చూడండి (video)

Advertiesment
వరుడి నాగినీ డ్యాన్స్ చూసీ.. వధువు ఏం చేసిందో చూడండి (video)
, బుధవారం, 13 నవంబరు 2019 (06:32 IST)
మరికాసేపట్లో పెళ్లి జరగబోతోంది. వధూవరుల బంధువులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులతో పెళ్లి మండపం కిక్కిరిసిపోయింది. ముహూర్త సమయం రానే వచ్చింది. స్నేహితులతో కలిసి నాగినీ డ్యాన్స్ చేస్తూ మండపానికి వచ్చిన పెళ్లి కొడుకును చూసిన వధువు బిత్తరపోయింది.

అతడి నాగినీ డాన్స్‌ను చూసి వీడూ.. వీడి వేషాలూ అనుకుంటూ అతడిని అసహ్యించుకుంది. పెళ్లి చేసుకోబోనంటూ తెగేసి చెప్పేసి పెళ్లి పీటల మీది నుంచి వెళ్లిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది.
 
ఇక, తనను పెళ్లి చేసుకునేది లేదన్న వధువు మాటలు విన్న పెళ్లి కొడుకు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆమె వద్దకు వెళ్లి చెంప చెళ్లుమనిపించాడు. దీంతో అప్పటి వరకు వేడుకగా ఉన్న ఆ పెళ్లి మండపం ఒక్కసారిగా రణరంగంగా మారింది. ఇరు కుటుంబాల వారు ఎగబడి మరీ కొట్టుకున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే మండపానికి వచ్చి ఇరు కుటుంబాలకు సర్దిచెప్పారు. వధువు కుటుంబం ఇచ్చిన లాంఛనాలను వెనక్కి ఇచ్చేందుకు వరుడి తరపు బంధువులు అంగీకరించడంతో వివాదం కాస్తా సద్దుమణిగింది.

ఈ ఘటనపై వధువు సోదరుడు మాట్లాడుతూ.. పెళ్లిలో వరుడు మద్యం తాగి అమర్యాదగా ప్రవర్తించినట్టు చెప్పాడు. పెళ్లి రద్దు కావడం తమకు బాధాకరమే అయినప్పటికీ సోదరి నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన