Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ-ఓటరు కార్డును నెలాఖరు వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

ఈ-ఓటరు కార్డును నెలాఖరు వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు
, గురువారం, 4 ఫిబ్రవరి 2021 (10:52 IST)
నూతన ఓటర్లు ఈ-ఎపిక్‌(ఈ-ఓటరు) కార్డును డౌన్‌లోడ్‌ చేసుకునే గడువును ఫిబ్రవరి చివరి వరకు పొడిగించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన కమిషనర్‌ శశాంక్‌ గోయల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఇటీవల ఓటు నమోదు చేసుకున్న నూతన ఓటర్లు https://voterportal.eci.gov.in, https://nvsp.inల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

2021 ఓటర్ల జాబితా సవరణకు ముందు ఓటు హక్కు నమోదు చేసుకుని, సెల్‌ఫోన్‌ నంబరు కూడా ఎన్నికల సంఘం వద్ద నమోదైన వారు ఈ-ఓటరు కార్డును ఎప్పటి నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నది త్వరలో ప్రకటిస్తామని శశాంక్‌ గోయల్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫిబ్రవరి15 నుండి తప్పకుండ ఫాస్ట్ స్టాగ్