Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చుక్..చుక్ కూత ఇక వినిపించదు..

చుక్..చుక్ కూత ఇక వినిపించదు..
, శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (07:51 IST)
150 ఏళ్ల క్రితం మెుదలై ఆ శత చక్ర వాహక ప్రస్థానం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రజల అభిమానాన్ని చూరగొన్న చుక్.. చుక్ రైలు ఎంతో మందిని గమ్యస్థానానికి చేరుస్తూ తన ప్రయాణాన్ని సుధీర్ఘకాలంగా కొనసాగిస్తోంది.

చుక్..చుక్ రైలు వస్తుంది.. పక్కకు పక్కకు జరగండి అంటూ తనతో మనకు మెుదటి పరిచయం మెుదలవుతుంది. రైలు అనగానే మనకు గుర్తొచ్చేది దాని కూతే. అయితే ఆ కూత ఇక వినిపించదంటా!… చుక్ చుక్ కూత ఇక చరిత్ర గర్భంలో కలసిపోనున్నది.
 
డిసెంబర్‌ నెల కల్లా రైళ్ల శబ్ధంలో మార్పులు రానున్నాయి. కి,మీ వరకు నేను వస్తున్నానంటూ చెప్పే ఆ పిలుపు ఇక వినిపించదు. బిగ్గరగా అరవకుండా అతి తక్కువ శబ్దంతో రైలు ప్రయాణం సాగనుంది. డీజిల్ ఇంజన్‌లకు ఉన్న కార్స్‌ని తొలగించి  విద్యుత్ సరఫరా ద్వారా శబ్ధం వచ్చేలా ఏర్పాట్లు చేయనున్నారు.

ప్రస్తుతం పవర్ కార్స్ 105 డెసిబిల్స్ శబ్దం చేస్తుండగా ఇక నుంచి అలాంటి సౌండ్‌కు ఆస్కారం ఉండదని రైల్వే అధికారులు తెలిపారు. వీటి స్థానంలో సైలెంట్ మోడ్స్‌ను ఫిక్స్ చేస్తామని రైల్వే బోర్డు అధికారి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు.

ఈ సైలెంట్ మోడ్‌ వల్ల రూ.800 కోట్ల విద్యుత్‌ను ఆదా అవుతుందన్నారు. ఇంతకు ముందే ఈ టెక్నాలజీని ముంబై-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రవేశపెట్టామని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిసెంబర్‌ ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డులు