నిర్భయ దోషుల మృతదేహాలు పోస్టుమార్టంకు తరలింపు

శుక్రవారం, 20 మార్చి 2020 (11:54 IST)
న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులను ఢిల్లీలోని తిహార్ సెంట్రల్ జైలులో ఉరి తీసిన అనంతరం వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించారు. 
 
నిర్భయ దోషులైన ముఖేశ్‌ సింగ్‌(32), వినయ్‌ శర్మ(26), అక్షయ్‌ ఠాకూర్‌ సింగ్‌(31), పవన్‌ గుప్తా(25)లను శుక్రవారం ఉదయం ఉరి తీసిన అరగంట తర్వాత వారి మృతదేహాలను ఉరికంబాల నుంచి కిందకు దించి వైద్యులు పరీక్షించారు. 
 
అనంతరం వారి మృతదేహాలను భారీ సాయుధ పోలీసుల బందోబస్తు మధ్య ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు పోస్టుమార్టం చేసి మృతదేహాలను వారి వారి కుటుంబసభ్యులకు అందజేయనున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రాత్రి 12 గంటల వరకు నిర్భయ మగ వ్యక్తితో ఎందుకు తిరిగింది..?