Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆన్‌లైన్‌లో వీడియో గేమ్స్.. పేటీఎం ద్వారా రూ.35వేలు గుంజేసిన బుడతడు

ఆన్‌లైన్‌లో వీడియో గేమ్స్.. పేటీఎం ద్వారా రూ.35వేలు గుంజేసిన బుడతడు
, శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (19:06 IST)
స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా చిన్నారులను అడ్డదారిన నడిపిస్తున్నాయనేందుకు ఈ ఘటనే ఉదాహరణ. ఆన్‌లైన్‌లో వీడియో గేమ్స్ ఆడుతున్న ఓ ఎనిమిదేళ్ల బుడతడు తండ్రి డబ్బు రూ.35వేలను పేటీఎం నుంచి మాయం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ తండ్రి షాకయ్యాడు. ఈ ఘటన యూపీలోని లక్నోలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఉన్నపళంగా బ్యాంక్ అకౌంట్ నుంచి 35 వేల రూపాయలు మాయం కావడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారించగా, బాధితుడి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ పేరిట పేటీయం అకౌంట్ ఉందని తేలింది. పేటీయం వాలెట్లోకి అకౌంట్ నుంచి డబ్బును ట్రాన్స్ ఫర్ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 
 
అయితే బాధితుడు తన పేరిట అసలు పేటీయం అకౌంట్ లేదని పోలీసులకు తెలిపాడు. దీంతో డబ్బు ఎవరు మాయం చేసి ఉంటారని కుటుంబ సభ్యులను ఆరా తీయగా, బాధితుడి కుమారుడే డబ్బును పేటీయం నుంచి మాయం చేస్తున్నాడని విచారణలో తేలింది. తండ్రి పేరిట పేటీయం అకౌంట్ సృష్టించి దాన్ని బ్యాంక్ అకౌంట్ తో జత చేసి డబ్బులు గుంజుతున్నట్లు గమనించారు. 
 
అంతేకాదు ఆ డబ్బుతో ఆన్‌లైన్ వీడియో గేమ్స్ ఆడుతున్నట్లు గుర్తించారు. నిందితుడు నాలుగో తరగతి చదువుతుండటంతో అతనిని కౌన్సిలింగ్ ఇవ్వడంతో పోలీసులు సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టెక్నాలజీతో ప్రభుత్వ సేవలన్నీ ఇంటికే చేరుస్తాం.. మంత్రి మేకపాటి