Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుట్టిపెరిగింది తమిళగడ్డపైనే.. కానీ, తెలుగు మట్టే అక్కడ పూజ్యనీయం

తెలుగు భాష మాట్లాడడానికే సిగ్గుపడుతున్న ప్రస్తుత తరంలో ఈ గ్రామ ప్రజలు మాత్రం తెలుగు మటిని పూజ్యనీయంగా భావిస్తారు. తమిళ గడ్డపైపెట్టి, తమిళ గాలి పీల్చుకుంటూ తెలుగు మట్టిని అమితంగా పూజిస్తున్నారు. ఇలాంటి

Advertiesment
పుట్టిపెరిగింది తమిళగడ్డపైనే.. కానీ, తెలుగు మట్టే అక్కడ పూజ్యనీయం
, బుధవారం, 1 మార్చి 2017 (11:58 IST)
తెలుగు భాష మాట్లాడడానికే సిగ్గుపడుతున్న ప్రస్తుత తరంలో ఈ గ్రామ ప్రజలు మాత్రం తెలుగు మటిని పూజ్యనీయంగా భావిస్తారు. తమిళ గడ్డపైపెట్టి, తమిళ గాలి పీల్చుకుంటూ తెలుగు మట్టిని అమితంగా పూజిస్తున్నారు. ఇలాంటి ప్రజలు తమిళనాడులోని ఛత్రపట్టి అనే గ్రామంలో ఉన్నారు. ఈ గ్రామం విరుదునగర్ జిల్లా రాజపాలెయం తాలూకా పరిధిలో ఉండగా, రాష్ట్ర రాజధాని చెన్నైకు 580 కిలోమీటర్ల దూరంలో ఉంది.
 
తమిళభాషను అధికారికంగా వినియోగిస్తున్నప్పటికీ తరాలుగా తెలుగు భాషనే ఇళ్లలో ఉపయోగిస్తున్నారు. తమిళవాసనలతో గుబాళించే తెలుగులో ఆట, పాటలు, వేడుకలు, ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతి తెలుగు పండగనూ వైభవంగా జరుపుకుంటారు. 2000 మంది వరకు ఉండే ఆ గ్రామంలో తెలుగు రానివారు లేరంటే అతిశయోక్తి కాదు. కుటుంబాల్లో పిల్లలకు తెలుగు కథలు, పాటలు వినిపిస్తారు. తెలుగు భాషను విధిగా ఇంట్లో మాట్లాడుతూ, తల్లి నేలను ప్రతిక్షణం గుర్తుచేసుకుంటారు. 
 
అక్కడ ప్రతి పెద్దా చెప్పే మాట ఒకటుంటుంది. అది ఏంటంటే...'బయట ఏదయినా మాట్లాడండి, కానీ ఇంట్లో మాత్రం తెలుగులోనే మాట్లాడండి, తల్లి నేలను, మాతృభాషను మర్చిపోతే జన్మనిచ్చిన వారిని మర్చిపోయినట్టే'. తిరుపతిలోని వెంకటేశ్వరస్వామిని ప్రతిఏటా పూజించుకుని తల్లినేలను ముట్టుకోవడం అక్కడి వారికి ఎంతో ఆనందం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రణబ్‌జీ... మా అమ్మను చంపేశారు.. నిజ నిర్ధారణ చేయించండి : పన్నీర్ వర్గ ఎంపీలు