ప్రణబ్‌జీ... మా అమ్మను చంపేశారు.. నిజ నిర్ధారణ చేయించండి : పన్నీర్ వర్గ ఎంపీలు
తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలితను కొందరు చంపేశారనీ, ఈ విషయంలో నిజనిర్ధారణ జరిపించాలంటూ అన్నాడీఎంకేకు చెందిన మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గీయులైన 12 మంది ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు రాష్ట్రపతి ప్ర
తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలితను కొందరు చంపేశారనీ, ఈ విషయంలో నిజనిర్ధారణ జరిపించాలంటూ అన్నాడీఎంకేకు చెందిన మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గీయులైన 12 మంది ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కలిసి వినతి పత్రం సమర్పించారు.
రాజ్యసభ ఎంపీ మైత్రేయన్ నేతృత్వంలోని 12 మంది ఎంపీల బృందం మంగళవారం ప్రణబ్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించింది. జయలలితకు ఆస్పత్రిలో చేసిన చికిత్సకు సంబంధించిన వివరాలు బహిర్గతం చేయాలని కోరారు.
72 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన జయమ్మను చూసేందుకు ఏ ఒక్కరినీ అనుమతించలేదని వారు గుర్తుచేశారు. పైగా, అమ్మకు పెట్టిన వెంటిలేటర్‌ను సైతం తొలగించారనీ, దాన్ని ఎవరి అనుమతితో తొలగించారో తేల్చాలని వారు డిమాండ్ చేశారు.
ఇకపోతే శాసనసభలో ప్రతిపక్షాలు లేకుండానే పళని స్వామి బలపరీక్ష నెగ్గినట్టు స్పీకర్ ప్రకటించారని, కాబట్టి విశ్వాస పరీక్షను రద్దు చేసి రహస్య ఓటింగ్‌కు ఆదేశించాలని వినతిపత్రంలో కోరారు.
దాదాపు అరగంటపాటు ప్రణబ్‌తో భేటీ అయిన ఎంపీలు జయ మృతిపై తమకున్న అనుమానాల గురించి ఆయనకు వివరించారు. అనంతరం మైత్రేయన్ విలేకరులతో మాట్లాడారు. జయ ఆస్పత్రిలో చేరడానికి ముందు పోయెస్‌గార్డెన్‌లో ఏం జరిగిందో చెప్పాలని శశికళను డిమాండ్ చేశారు.