Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మకు శశికళ స్లో-పాయిజన్ ఇచ్చేసింది.. 2012లో తెహల్కా కథనం.. మన్నార్ గుడి మాఫియా?

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5న మృతి చెందిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 22న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత 75 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆమె మరణ

Advertiesment
Tehelka Says Sasikala Conspired To Give Slow Poison To Jayalalithaa
, శనివారం, 10 డిశెంబరు 2016 (11:45 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5న మృతి చెందిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 22న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత 75 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆమె మరణంపై తమిళ ప్రజల్లోనే రాజకీయ నేతల్లో కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, జయ మృతిపై తమకు అనుమానాలున్నాయంటూ ప్రముఖ నటి గౌతమి.. ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ కూడా రాశారు.
 
జయలలిత మరణం తర్వాత ఆమె మృతిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏదో జరిగింది అంటూ పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. సినీ నటి గౌతమి అయితే తన అనుమానాలను వ్యక్తీకరిస్తూ ప్రధాని మోదీకి ఏకంగా లేఖనే సంధించారు. ఈ నేపథ్యంలో 2012లో ప్రముఖ పత్రిక తెహల్కా శశికళ గురించి సంచలన కథనాన్ని ప్రచురించింది. 2012లో తెహల్కా రాసిన ఈ కథనం... ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వచ్చి, సంచలనం రేపుతోంది. మన్నార్ గుడి మాఫియాను ఏర్పాటు చేసుకున్న శశికళ అనేక అక్రమాలకు పాల్పడ్డారని కథనంలో ఆరోపించింది. 
 
అంతేకాకుండా, జయలలితను చంపేందుకు కూడా కుట్ర చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోయస్ గార్డెన్ నుంచి తనను జయ వెళ్లగొట్టిన తర్వాత... తాను నియమించిన నర్సు ద్వారా జయకు శశికళ స్లో పాయిజన్ ఎక్కించారని పేర్కొంది. తాను వాడుతున్న మందులపై జయ చేయించుకున్న వ్యక్తిగత వైద్య పరీక్షల్లో కూడా ఈ విషయం వెల్లడైందని తెహల్కా పేర్కొంది. 
 
శశికళను సీఎంను చేయడానికి మన్నార్ గుడి మాఫియా ఎన్నో ప్రయత్నాలను చేసిందని ఆరోపించింది. అక్రమాలకు పాల్పడిన శశికళను, ఆమె బంధువులను పోయస్ గార్డెన్ నుంచి జయ వెళ్లగొట్టిన తర్వాత... జయను మళ్లీ మచ్చిక చేసుకుని, ఆమె వద్దకు చేరిన శశికళ... ఆ తర్వాత పోయస్ గార్డెన్ నుంచే ఆమెపై కుట్రలు సాగించిందని తెహల్కా తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు పెళ్లై వుంటే నలుగురి పిల్లలకు అమ్మనయ్యేదాన్ని.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డా: జయలలిత