Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాకు పెళ్లై వుంటే నలుగురి పిల్లలకు అమ్మనయ్యేదాన్ని.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డా: జయలలిత

తమిళనాడు దివంగత సీఎం జయలలితకు మనోనిబ్బరం ఎక్కువ. ఆమె రాజకీయ నాయకురాలిగా.. తమిళనాట ప్రజలకు బాగా తెలుసు. కానీ అమ్మ ఒంటరితనంపై ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆత్మకథలో వెల్లడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగ

Advertiesment
Jayalalithaa Buried In Sandalwood Casket Next To Mentor MGR: 10 Points
, శనివారం, 10 డిశెంబరు 2016 (10:30 IST)
తమిళనాడు దివంగత సీఎం జయలలితకు మనోనిబ్బరం ఎక్కువ. ఆమె రాజకీయ నాయకురాలిగా.. తమిళనాట ప్రజలకు బాగా తెలుసు. కానీ అమ్మ ఒంటరితనంపై ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆత్మకథలో వెల్లడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే 'నేను చేసిన మొదటి తప్పు.. నా జీవితానికి సంబంధించి అనేకమంది బతికుండగానే స్వీయచరిత్ర రాయడం మొదలుపెట్టడమేనని చెప్పుకొచ్చారు. రెండో తప్పు రాయడం సూటిగా ఉండడం అంటూ జయలలిత తెలిపారు.
 
జీవితంలో ఇక సాధించేందుకు ఏమీ లేదని నిర్ణయించుకున్న తర్వాత ఓ సందర్భంలో తనకంటూ వ్యక్తిగత జీవితం లేదని జయలలిత చెప్పుకొచ్చారు. తాను జీవించేది పార్టీతో పాటు ప్రజల కోసమని, పార్టీ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధమని ప్రకటించారు. అలాగే తాను కూడా అందర్లా తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురయ్యానని చెప్తూ, 'నా జీవితంలో ఒక సందర్భంలో నేను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాను' అంటూ వెల్లడించారు.
 
తన జీవితం, వృత్తి సుడిగాలి లాంటిదని చెప్పారు. తనలో కోపం, బాధ, శోకం అన్నీ ఉన్నా నాయకురాలి స్థానంలో వున్నప్పుడు భావోద్వేగాలను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉందంటూ గొప్ప మనోనిబ్బరాన్ని ప్రదర్శించారు. ఇలా ఆమె ఎంజీఆర్ అంత్యక్రియల్లో పాల్గొన్నప్పుడు గొప్ప మనోనిబ్బరాన్ని ప్రదర్శించారు. అలాగే అసెంబ్లీలో తీవ్ర పరాభవం జరిగినప్పుడు అదే నిబ్బరంతో సవాల్ చేశారు. ఆ తరువాత ఓసారి ఒంటరితనం వేధించగా 'అమ్మ సంపాదించినదంతా కూడబెట్టి ఉంటే కనుక అసలు నేను సినిమాల్లోకే వచ్చుండేదాన్ని కాదు' అంటూ వాపోయారు. 
 
ఇంకా తనను బాగా చదివించి, సాధారణ కుటుంబపు అమ్మాయిలా 18, 19 ఏళ్లలోనే మంచి కుటుంబంలోకి ఇచ్చి పెళ్లి చేసుంటే, తాను నలుగురు పిల్లలకు అమ్మనై ఉండేదాన్ని. ఇన్ని ఎత్తుపల్లాలు తన జీవితంలో ఉండేవి కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఆమె పార్టీ, ప్రజలు ఉన్నా తనకంటూ వ్యక్తిగత జీవితం, తనకంటూ ఎవ్వరూ లేరనే బాధ జయలలిత ఉండేదని సన్నిహితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెద్ద నోట్ల కష్టాలు.. బ్యాంకులకు 3 రోజులు సెలవు.. జమ్మూలో పరిస్థితి భిన్నం..?