Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పిన కేంద్రం

Advertiesment
Teacher Eligibility Test
, గురువారం, 3 జూన్ 2021 (16:30 IST)
దేశంలోని ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు కేంద్రం శుభవార్త చెప్పింది. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఈటీ - ఉపాధ్యాయ అర్హత పరీక్ష) క్వాలిఫయింగ్ సర్టిఫికేట్ అభ్యర్థి జీవిత కాలం చెల్లుతుందని ప్రకటించింది. 
 
గతంలో ఈ సర్టిఫికేట్ కాలపరిమితి ఏడేళ్లు మాత్రమేవుండేది. తాజాగా దీనిని జీవిత కాలానికి పొడిగించింది. ఈ పొడిగింపు 2011 నుంచి వర్తిస్తుందని చెప్పడం మరొక గొప్ప శుభవార్త. ఈ విషయాన్ని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ‘నిషాంక్’ గురువారం వెల్లడించారు. 
 
ఈ వివరాల మేరకు... టీఈటీ క్వాలిఫయింగ్ సర్టిఫికేట్ చెల్లుబాటు సమయాన్ని ఏడేళ్ళ నుంచి జీవిత కాలానికి పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పొడిగింపు 2011 నుంచి వర్తిస్తుంది. 
 
ఇప్పటికే ఏడేళ్ళకాలం పూర్తయిన అభ్యర్థులకు కొత్తగా టీఈటీ సర్టిఫికేట్లను జారీ చేయడానికి లేదా, పాతవాటిని రీవ్యాలిడేట్ చేయడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. 
 
ఉపాధ్యాయ వృత్తిలో కెరీర్‌ కోసం శ్రమించేవారికి ఉద్యోగావకాశాలను పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రమేశ్ పోఖ్రియాల్ చెప్పారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియమితులుకావాలంటే టీఈటీలో ఉత్తీర్ణులవడం తప్పనిసరి. 
 
2011 ఫిబ్రవరిలో  నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు టీఈటీని నిర్వహిస్తాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి జారీ చేసే సర్టిఫికేట్లు ఆ పరీక్ష పాసైన తేదీ నుంచి ఏడేళ్ళపాటు చెల్లుబాటవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆన్‌లైన్‌లో ఆనందయ్య మందు: కుండబద్ధలు కొట్టిన కొడుకు శశిధర్