Publish Date: Thu, 03 Jun 2021 (16:07 IST)
Updated Date: Thu, 03 Jun 2021 (16:09 IST)
ఆనందయ్య మందుపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ. రాష్ట్రప్రభుత్వం ఆనందయ్య మందును తయారుచేసుకోవడానికి అనుమతి ఇచ్చిన తరువాత ఎప్పుడు మందును తయారుచేసి ఇస్తారా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మూలికలు సమకూర్చుకోవడానికి సమయం పడుతుంది.. తనకు సమయం కావాలంటున్నాడు ఆనందయ్య.
అయితే ఇప్పటికే ఆన్లైన్లో ఆనందయ్య మందును డోర్ డెలివరీ చేస్తారంటూ రకరకాల వెబ్‌సైట్లలో ట్రోల్ అవుతున్నాయి. దీంతో జనం ఆ వెబ్‌సైట్లను ఓపెన్ చేసి బుక్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆనందయ్య కొడుకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆన్లైన్‌లో ఆనందయ్య మందు పంపిణీకి ఇంకా ఏర్పాట్లు చేయలేదని స్పష్టం చేశారు ఆనందయ్య కుమారుడు శశిధర్. ముందుగా మందును తయారుచేసి సర్వేపల్లి నియోజకవర్గానికే ఇస్తామంటున్నారు. అంతేకాదు ఆ తరువాతే ఆన్లైన్ గురించి ఆలోచిస్తామని చెప్పారు.
ఇప్పటివరకు ఆన్ లైన్ గురించి ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. మేమే అధికారికంగా ప్రకటించేంత వరకు ఎవరూ నమ్మవద్దని.. కొంతమంది కావాలనే ఇష్టానుసారం వెబ్‌సైట్ లింక్‌లను వాట్సాప్ గ్రూపులలో ఫార్వర్డ్ చేస్తున్నారని.. ఇందులో ఎంతమాత్రం నిజం లేదంటున్నారు. అసలు ఆన్‌లైన్లో బుక్ చేసుకోవద్దంటున్నారు ఆనందయ్య కొడుకు శశిధర్.
జె
Publish Date: Thu, 03 Jun 2021 (16:07 IST)
Updated Date: Thu, 03 Jun 2021 (16:09 IST)