కరుణ ఆరోగ్యం... కలవరపడుతున్న తమిళజనం...
తమిళనాడు మాజీముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం ఇబ్బందికరంగా మారడంతో ఆయనను కావేరి ఆసుపత్రిలో చేర్చారు. బుధవారం ఉదయం ఆయన శ్వాస తీసుకోవడంలో తీవ్ర సమస్య ఎదుర్కోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమధ్య జయలలితను ఆసుపత్రిలో చేర్పించినప్పుడే కరుణానిధి కూడా ఆస
తమిళనాడు మాజీముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం ఇబ్బందికరంగా మారడంతో ఆయనను కావేరి ఆసుపత్రిలో చేర్చారు. బుధవారం ఉదయం ఆయన శ్వాస తీసుకోవడంలో తీవ్ర సమస్య ఎదుర్కోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమధ్య జయలలితను ఆసుపత్రిలో చేర్పించినప్పుడే కరుణానిధి కూడా ఆసుపత్రి పాలయ్యారు.
అప్పట్లో ఆందోళన నెలకొన్నప్పటికీ ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో ఇంటికి తీసుకువచ్చారు. ఐతే ముఖ్యమంత్రి జయలలిత మాత్రం అనారోగ్యంతో కన్నుమూశారు. ఇప్పుడు మళ్లీ కరుణానిధి ఆరోగ్యం ఆందోళనకరంగా వున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలావుంటే తమిళనాడులో రాజకీయ సంక్షోభం నెలకొని వుంది. ఒకవైపు దినకరన్, ఇంకోవైపు పన్నీర్ సెల్వం ఇద్దరూ ముఖ్యమంత్రి పళనిస్వామికి కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నారు. రాజకీయ అనిశ్చిత ఒకవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ చీఫ్ కరుణానిధి అనారోగ్యం సమస్య తమిళులకు ఇబ్బందికరంగా మారాయి.