Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

శరీరంపై మూత్రం పోశారు... మానవ మలాన్ని తినిపించారు... ఎక్కడ?

Advertiesment
Tamil Nadu
, బుధవారం, 8 మే 2019 (14:59 IST)
మూడేళ్ల శత్రుత్వానికి ప్రతీకారం తీర్చుకునే చర్యల్లో భాగంగా ఓ వ్యక్తి శరీరంపై మూత్రం పోశారు. ఆ తర్వాత మానవమలం తినిపించారు. ఈ దారుణ తమిళనాడు రాష్ట్రంలోని తిరుపూరు జిల్లా కొత్తూరు పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మూడేళ్ళ క్రితం ఓ ఆలయం వద్ద గ్రామంలోని కల్లార్‌, దళిత కులస్తులకు మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో దళిత కులస్తుడైన పి. కొల్లిమలై, కల్లార్‌ కులస్తులైన శక్తివేల్‌, రాజేశ్‌, రాజ్‌కుమార్‌ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కొల్లిమలైపై ఈ ముగ్గురు శత్రుత్వం పెంచుకున్నారు. 
 
అదునుచూసి దెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్న ఆ ముగ్గురు.. ఏప్రిల్‌ 28న కొల్లిమలై ఒంటరిగా బైక్‌పై వస్తున్న సమయంలో అతడిపై దాడి చేశారు. కర్రలతో చితకబాదారు. అంతటితో ఆగకుండా తమ శత్రుత్వానికి ప్రతీకగా బలవంతంగా మానవ మలాన్ని కొల్లిమలైకి తినిపించారు. 
 
ముగ్గురు కలిసి అతనిపై మూత్రం పోసి కసి తీర్చుకున్నారు. దీనిపై బాధితుడు కొల్లిమలై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎట్టకేలకు ఈ కేసులో నిందితులైన ముగ్గురిలో ఇద్దరిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ముగ్గురుదాడిలో తీవ్రంగా గాయపడిన కొల్లిమలైను ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్తి పంపకంలో తగాదాలు... ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు సూసైడ్