Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అయ్యా... అది చేస్తాను... సహకరించండి..... ఏంటది?

తమిళనాడు పేరు చెబితే చాలు వెంటనే రాజకీయాలే ప్రతి ఒక్కరికి గుర్తుకు వస్తుంది. జయలలిత మరణం తర్వాత ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఉత్కంఠ రేపుతున్న రాజకీయాలతో తమ

అయ్యా... అది చేస్తాను... సహకరించండి..... ఏంటది?
, ఆదివారం, 28 మే 2017 (08:46 IST)
తమిళనాడు పేరు చెబితే చాలు వెంటనే రాజకీయాలే ప్రతి ఒక్కరికి గుర్తుకు వస్తుంది. జయలలిత మరణం తర్వాత ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఉత్కంఠ రేపుతున్న రాజకీయాలతో తమిళ ప్రజలే కాదు దేశ ప్రజలు ఆశక్తిగా చూస్తున్నారు. గత కొన్ని రోజుల ముందు వరకు మాత్రం పళనిస్వామి - పన్నీరు సెల్వం చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్న ఆ తర్వాత మాత్రం రజినీకాంత్ చుట్టూ తిరిగాయి. రజినీ రాజకీయాల్లోకి రావడం అన్ని పార్టీలను భయపడేలా చేస్తోంది. అందులో ప్రధానంగా భయపడేది ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామి. అందుకే బిజెపి మద్థతును కోరేందుకు ఇప్పటికే మూడుసార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు పళనిస్వామి. 
 
శశికళ జైలుకు వెళ్ళిన తరువాత జాక్ పాట్‌లా పళనిస్వామిని ముఖ్యమంత్రి పదవి లభించింది. తానెప్పుడూ ముఖ్యమంత్రి అవుతానని కలలో కూడా పళనిస్వామి ఊహించి ఉండటంని ఆ పార్టీ నేతలే చెబుతుంటారు. అయితే పళనిస్వామిపై మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం.. అన్నాడీఎంకే రెండుగా చీలిపోవడం ఇలాంటి జరిగిపోయాయి. ఆ తర్వాత శశికళ, దినకరన్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం.. పళని - పన్నీరులు కలిసే ప్రయత్నం ఇదంతా కూడా జరుగుతున్నాయి. వీరిద్దరి మధ్య ఆ ముఖ్యమంత్రి పీఠమై అడ్డొస్తోంది. అందుకే ఇద్దరూ ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. ఇంతలో రజినీ రాజకీయాల్లోకి వస్తున్నారన్న ప్రచారం... ఆ తర్వాత అభిమానులతో సమావేశం... అంతా జరిగిపోతున్నాయి. దీంతో పళనిస్వామి ఇక చేసేది లేక ప్రభుత్వాన్ని.. తన పదవిని కాపాడుకునేందుకు ప్రధాని మోడీ దగ్గరకు వెళుతున్నారు.
 
ఇప్పటికే మూడుసార్లు కలిసిన పళనిస్వామి.. తమ ప్రభుత్వాన్ని కాపాడాలంటూ వేడుకుంటున్నారు. రజినీ సొంతంగా పార్టీ పెట్టే ఆలోచనలో ఉండడంతో కేంద్రప్రభుత్వ మద్దతు తనకు ఉంటే సులువుగా ప్రభుత్వాన్ని నడిపే అవకాశం ఉంటుందనేది పళని ఆలోచన. అందుకే మోడీని పదే పదే కలుస్తున్నాడు పళని. ఒకవేళ రజినీ బీజేపీలో కలిస్తే మాత్రం పళనిస్వామి పనైపోయినట్లేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబులు.. ఏందయ్యా ఇది... జరభద్రం..?