Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాబులు.. ఏందయ్యా ఇది... జరభద్రం..?

తెలంగాణా... ఆ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కె.చంద్రశేఖర్ రావు అభివృద్ధి వైపు పరుగులు తీయించారు. ఆర్థికంగా రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేకపోయినా అభివృద్ధిలో మాత్రం వెనుకడుగు వే

బాబులు.. ఏందయ్యా ఇది... జరభద్రం..?
, ఆదివారం, 28 మే 2017 (08:44 IST)
తెలంగాణా... ఆ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కె.చంద్రశేఖర్ రావు అభివృద్ధి వైపు పరుగులు తీయించారు. ఆర్థికంగా రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేకపోయినా అభివృద్ధిలో మాత్రం వెనుకడుగు వేసిందని అందరూ భావిస్తున్నారు. అందుకు కారణం ఎమ్మెల్యేలు, ఎంపిలేనట. అతి రహస్యంగా కేసీఆర్ తెలంగాణాలో ప్రజాప్రతినిధుల పనితీరుపై సర్వే చేయించారు. అది కూడా రెండునెలల పాటు సర్వే చేయించి మార్కులు నిర్ణయించారట. 75 శాతంకుపైగా ఎమ్మెల్యేలకు 100కు 35కన్నా తక్కువ మార్కులు వచ్చాయట. కేసీఆర్‌కు 98 మార్కులు, కేటిఆర్‌కు 95 మార్కులు, హరీవ్ రావుకు 93 మార్కులు ఇలా వారి వారి శాఖల్లో పనిచేసే వారిలో వీరు ముగ్గురు అగ్రగణ్యులు. 
 
ఇక చేసేది లేక కేసీఆర్ అత్యవసరంగా ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమయ్యారు. ఉన్నట్లుండి సమావేశమవ్వడానికి ఒక కారణం కూడా ఉంది. బీజీపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణాలో పర్యటించి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసి వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని చెప్పి మరీ వెళ్ళారు. అందుకే కేసీఆర్ ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండడం ప్రారంభించారు. ఎక్కడా కూడా తెలంగాణా ప్రభుత్వం పడిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎమ్మెల్యేలను పిలిచి కేసీఆర్ చెడామెడా తిట్టేశారు. 
 
ఏంటిది.. ఎమ్మెల్యేలు.. మీ నియోజకవర్గాలకు వెళుతున్నారా.. లేక కార్లలోనే షికార్లు చేస్తున్నారా అంటూ గద్గద స్వరంతోనే ప్రజాప్రతినిధులకు క్లాస్ పెరికారట. అంతటితో ఆగని కేసీఆర్ ఇలా చేస్తే మీరు బాధపడటం ఖాయమని చెప్పుకొచ్చారట. ఇప్పటికైనా అప్రమత్తవవ్వడం... ఈరోజు ఎన్నికలు జరిగినా 111 స్థానాల్లో మనం గెలుస్తాం.. అందరూ ఎమ్మెల్యేలు పనిచేయాలిగా అంటూ వార్నింగ్ ఇచ్చారట. ఇప్పటి వరకు పెద్దగా పట్టించుకోని కేసీఆర్ బీజేపీకి భయపడే ఇలా చేస్తున్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడు సంవత్సరాల బిజెపి పాలనలో అభివృద్ధి జరిగిందా?!