తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రధానికి లేఖ రాశారు. రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు సప్లై చేస్తున్న 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాను ఆపివేయాలని, తమిళనాడులో రోజు రోజుకు కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలో తయారయ్యే ఆక్సిజన్‌ను రాష్ట్రంలోనే వినియోగించుకునే అవకాశం కల్పించాలని తెలిపారు.
ప్రస్తుతం తమిళనాడుకు రోజు 310 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతుందని, రాబోయే రోజుల్లో మరింత అవసరమయ్యే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకొని 80 మెట్రిక్ టన్నులను తెలుగు రాష్ట్రాలకు ఎగుమతి కాకుండా నిలిపివేయాలని పళనిస్వామి ప్రధానికి లేఖ రాశారు.
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలో 310 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ ఖర్చు అవుతోందని, కానీ కేంద్రం కేవలం 220 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను మాత్రమే కేటాయించిందని శ్రీ పెరంబదూర్ నుంచి సప్లై అవుతున్న 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను తమిళనాడుకు కేటాయించాలని పళనిస్వామి లేఖలో పేర్కొన్నారు.