నమ్ తమిళర్ పార్టీ కోఆర్డినేటర్ సీమాన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ నటి విజయలక్ష్మి చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. కోలీవుడ్ హీరోలు విజయ్, సూర్య నటించిన ఫ్రెండ్స్ సినిమాలో సూర్య సరసన నటి విజయలక్ష్మి నటించింది. తనకు సీమాన్‌తో పెళ్లయిందని, సీమాన్ తనను మోసం చేసి వేరే పెళ్లి చేసుకున్నాడని ఆమె పలు ఇంటర్వ్యూలలో చెప్పారు.
తాజాగా సీమాన్ నన్ను పెళ్లి చేసుకున్న మాట వాస్తవమేనని, సీమాన్ చేతిలో అవమానానికి గురైయ్యానని... ఈ విషయం చెప్పడం కోసమే ఇక్కడికి వచ్చానని చెన్నై కార్పొరేషన్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఇక తమిళ పార్టీ కోఆర్డినేటర్ సీమాన్‌ను అరెస్ట్ చేయాలంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. "సీమాన్ వల్ల నాకు అవమానం తప్పలేదు. డబ్బు కోసం ఇదంతా చేయలేదు" అని నటి విజయలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించారు.
మరోవైపు 2020లో విజయలక్ష్మి స్లీపింగ్ ట్యాబ్లెట్‌లు వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే వెంటనే ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, ఆమె కోలుకుంది. మరోవైపు ఆమె కేసును తిరువాన్మియూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.