Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

swathi maliwal

ఠాగూర్

, శుక్రవారం, 17 మే 2024 (11:34 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో తనపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ తొలిసారి పెదవి విప్పారు. ఆ రోజు జరిగిన ఘటనను దురదృష్టకరంగా భావించిన ఆమె... ఈ ఘటనను రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సీఎం నివాసంలో స్వాతి మలివాల్‌పై దాడి జరిగిందన్న వార్తల నేపథ్యంలో ఆమె తొలిసారిగా స్పందించారు. ఆ రోజు ఏం జరిగిందనేది పోలీసులకు స్పష్టంగా వివరించాన‌ని, పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారని తెలిపారు. ఈ విషయంలో పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
 
'దురదృష్టవశాత్తు నాకు భయంకరమైన అనుభవం ఎదురైంది. ఈ విషయంలో నా కోసం ప్రార్థించిన వారికి ధన్యవాదాలు. దీనిపై నా క్యారెక్టర్ అసాసినేషన్‌కు ప్రయత్నించిన వారికీ దేవుడు మంచి చేయాలనే కోరుకుంటున్నా' అంటూ స్వాతి మలివాల్ గురువారం ట్వీట్ చేశారు. దేశంలో అత్యంత కీలకమైన ఎన్నికలు జరుగుతున్నాయని గుర్తుచేస్తూ.. తనపై జరిగిన దాడిని రాజకీయం చేయొద్దని బీజేపీ నేతలకు స్వాతి మలివాల్ విజ్ఞప్తి చేశారు. 
 
కాగా, పోలీసులకు స్వాతి మాలివాల్ ఇచ్చిన వాంగ్మూలంలోని అంశాలను పరిశీలిస్తే, 'సీఎం కేజ్రివాల్‌ను కలిసేందుకు వెళ్లిన ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి జరిగింది. సీఎం పర్సనల్‌పై అసిస్టెంట్ (పీఏ) వైభవ్ కుమార్ ఆమెపై దాడి చేశాడు. చెంపపై కొట్టడంతో పాటు పొట్టలో కాలితో తన్నాడు. కర్రతో కొట్టాడని ఎంపీ స్వాతి మలివాల్ స్టేట్మెంట్ ఇచ్చారు. అతని దాడి నుంచి తప్పించుకుని బయటపడ్డ ఎంపీ.. అక్కడి నుంచే పోలీసులకు ఫోన్ చేశారు. అనంతరం పోలీస్ లైన్స్‌లోని స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. వైద్య పరీక్షలు చేయించాలని చెప్పడంతో మళ్లీ వచ్చి ఫిర్యాదు చేస్తానని వెళ్లిపోయారు. ఎంపీ స్వాతి మలివాల్ చెప్పిన వివరాలతో స్టేట్మెంట్ రికార్డు చేసి దీని ఆధారంగా ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేశామని డీసీపీ మీనా తెలిపారు. సీఎం కేజ్రివాల్ పీఏ వైభవ్ కుమార్‌కు నోటీసులు పంపించినట్లు వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?