Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సూరత్ వజ్రాల వ్యాపారి నిజస్వరూపం ఇదీ... ఉద్యోగులకు కార్లు ఇచ్చి.. పీఎఫ్ ఎగ్గొట్టాడు!

దీపావళి బోనస్‌గా తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు వందలాది కార్లు, ఫ్లాట్లు, బంగారు ఆభరణాలు పంచిపెట్టి దేశ కార్పొరేట్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసిన సూరత్ వజ్రాల వ్యాపారి గుర్తున్నాడా...? ఆయన ఇప్పు

Advertiesment
సూరత్ వజ్రాల వ్యాపారి నిజస్వరూపం ఇదీ... ఉద్యోగులకు కార్లు ఇచ్చి.. పీఎఫ్ ఎగ్గొట్టాడు!
, ఆదివారం, 18 డిశెంబరు 2016 (13:55 IST)
దీపావళి బోనస్‌గా తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు వందలాది కార్లు, ఫ్లాట్లు, బంగారు ఆభరణాలు పంచిపెట్టి దేశ కార్పొరేట్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసిన సూరత్ వజ్రాల వ్యాపారి గుర్తున్నాడా...? ఆయన ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. అయితే ఈ సారిమాత్రం మంచిపని చేసి కాదు. ఉద్యోగుల భవిష్య నిధికి చెల్లించాల్సిన సొమ్మును చెల్లించకుండా వార్తలకెక్కాడు. ఆయన పేరు సావ్ జీ ధోలాకియా. సుమారు రూ.6,000 కోట్ల టర్నోవర్‌తో కూడిన హరే కృష్ణ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీకి అధిపతి.
 
గత 2014 సంవత్సరంలో దీపావళి బోనస్ కింద తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు 491 కార్లు, 207 ఫ్లాట్స్, అత్యంత విలువైన ఆభరణాలను కానుకగా ఇచ్చి దేశ వ్యాప్తంగా మంచి పేరుకొట్టేశాడు. మరి ఉద్యోగుల విషయంలో ఇంత చేస్తున్న ఆయన వారి సంక్షేమంలో భాగమైన ఉద్యోగుల భవిష్యనిధి సంస్థకు చెల్లించాల్సిన మొత్తాన్ని మాత్రం చెల్లించలేదు. 
 
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌కు ఆయన మొత్తం రూ.16.66 కోట్ల రూపాయల మేరకు చెల్లించాల్సి ఉందని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ వాస్తవం ఏమిటంటే... ఆయన కంపెనీలో 3,165 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కానీ, 17 మంది ఉద్యోగులనే ఈపీఎఫ్ పరిధిలో చూపిస్తూ మిగిలిన వారికి అసలు ఈపీఎఫ్ ప్రయోజనాలు కల్పించడం లేదని అధికారులు గుర్తించారు. దీంతో సూరత్‌లోని ఈపీఎఫ్ వో కార్యాలయం ఈ వ్యవహారంపై రెండేళ్ల పాటు విచారణ జరిపి 15 రోజుల్లోగా రూ.16.66 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీచేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరోయిన్‌గా ఉందని ప్రేమించి పెళ్లి.. కట్నం ఇవ్వలేదని జుట్టు కత్తిరింపు.. భర్త కిరాతక చర్య